Saturday, September 13, 2025 09:06 AM
Saturday, September 13, 2025 09:06 AM
roots

వాసన్న… నీకిది తగునా?

నాయకుల మద్యం వ్యాపారం… తెలుగుదేశం పార్టీకి కావాల్సినంత చెడ్డపేరు తెచ్చి పెట్టిందనే చెప్పాలి. ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చామని గొప్పగా చెప్పుకుంటున్న నేతలు… ఐదేళ్ల పాటు కోల్పోయిన ఆదాయాన్ని ఒక్క ఏడాదిలోనే సంపాదించాలని ఆత్రపడుతున్నారు. అందుకే… మద్యం షాపుల కోసం సిండికేట్‌ అయ్యారు. చివరికి అప్లికేషన్ వేసే వారిని కూడా బెదిరించారు. ఇక లాటరీ తగిలిన తర్వాత కూడా షాపు వచ్చిన వారిని బెదిరించి మరీ షాపులు సొంతం చేసుకునేందుకు యత్నించారు. కొన్ని చోట్ల ఎదిరించి షాపు ఓపెన్ చేసిన వారిపై దాడులు కూడా చేశారు. చివరికి ఈ విషయం సీఎం వరకు చేరడంతో… ప్రజాప్రతినిధుల సమావేశంలో గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు.

అయితే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ… వాసు మాత్రం లాటరీ సమయంలో చక్రం తిప్పారనే మాట వినిపిస్తోంది. మద్యం వ్యాపారాన్ని పూర్తిగా తమ కంట్రోల్‌లో పెట్టుకున్నారు కూడా. అదే సమయంలో సొంత పార్టీ నేతలను కాదని.. వైసీపీ చెందిన నేతలకు మద్యం సిండికేట్‌లో వాటాలిచ్చారు ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇదే ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్.

రాజమండ్రి సిటీ నియోజకవర్గం పరిధిలో మూడు వంతులు మద్యం షాపులు తన చెప్పుచేతల్లోనే పెట్టుకున్న వాసు… వాటిని దక్కించుకునేందుకు బెదిరించినట్లు ఇప్పటికే పార్టీ అధినేతకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి కూడా. గోపాలపురం ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ నేత షాపుల కోసం దాదాపు 80 అప్లికేషన్లు వేశారు. లాటరీలో రెండు షాపులు కూడా వచ్చాయి. అయితే వాటిల్లో ఒకటి తమకు ఇచ్చేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేశారట. ఆ వైసీపీ నేతలకు వాసు కూడా మద్దతు తెలిపినట్లు సదరు నేత పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశాడు.

Read Also : హడావిడిగా లోకేష్ ఢిల్లీ ఎందుకు.. వైసీపీలో టెన్షన్..!

ఆదిరెడ్డి వాసుకు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, గణేష్, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయనేది బహిరంగ రహస్యం. ఒక దశలో వాసు పార్టీ మారుతారనే ప్రచారం కూడా జోరుగా వినిపించింది. ఇప్పటికీ ఇదే సంబంధాలు కొనసాగిస్తున్నారు వాసు. మద్యం వ్యాపారంలో జక్కంపూడి గణేష్‌కు వాటాలు ఇచ్చారని వాసుపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పార్టీ పెద్దలకు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.

అయితే కింజరాపు ఇంటి అల్లుడు కావడంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు కాస్త వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న మామ రాష్ట్ర మంత్రి, బావమరిది కేంద్ర మంత్రి కావడంతో పాటు పార్టీలో కీలక స్థాయిలో ఉండటంతో వాసు ఆగడాలు మితిమీరిపోయాయని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్