Thursday, September 11, 2025 08:45 PM
Thursday, September 11, 2025 08:45 PM
roots

వైసీపీకీ టీడీపీ భరోసా..!

వైసీపీకి గుర్తింపు వస్తుందా.. వైసీపీ నేతల్లో భయం పోతుందా.. రాబోయే ఎన్నికల నాటికి వైసీపీ మళ్లీ బలపడుతోందా.. అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఇందుకు ఏకైక కారణం కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం జరుగుతున్న విషయాలు చూస్తే.. అవుననే మాటే వినిపిస్తోంది. మళ్లీ మనదే అధికారమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెబుతుంటే.. ముందు అంతా నవ్వుకున్నారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వ చర్యలు చూస్తుంటే మాత్రం.. వైసీపీ నేతల్లో కూడా అదే తరహా ధీమా వ్యక్తం అవుతోంది. గతంలో వైసీపీ చేసిన తప్పులనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుందనే మాట బాగా వినిపిస్తోంది.

Also Read : ఇప్పటికైనా కలిసి పని చేస్తారా.. లేదా..?

వై నాట్ 175 అని గొప్పగా చెప్పుకున్నారు జగన్. అలాగే మరో 30 ఏళ్ల పాటు తానే సీఎం అని కూడా ప్రకటించుకున్నారు. అయితే ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో చేసిన తప్పులే వైసీపీ ఓటమికి ప్రధాన కారణం. ఇందులో ప్రధానమైనది చంద్రబాబు అరెస్టు. తర్వాత లోకేష్ పాదయాత్ర సమయంలో అడ్డంకులు. టీడీపీ నేతలు ఏవైనా ఆందోళన చేపడితే వాటిని అడ్డుకునేలా హౌస్ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు. ఇవన్నీ అప్పట్లో సోషల్ మీడియాలో వీటికి బాగా ప్రచారం లభించింది.

వైఎస్ జగన్ సర్కార్ చేసిన తప్పులను చాలా దగ్గరగా గమనించిన ఏపీ ప్రజలు.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి భారీ మెజారిటీతో అధికారం కట్టబెట్టారు. వైసీపీకి చివరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వైసీపీ చేసిన తప్పులు టీడీపీ చేయదని అంతా భావించారు. కానీ ప్రజల అంచనాలు తల్లకిందులు అవుతున్నాయి. అధికార పార్టీ తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే తప్పుబట్టడం ప్రతిపక్షాలకు అలవాటు. అలాగే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలను కూడా వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. అయితే వీటిల్లో కొన్నిటికి ప్రజలు కూడా మద్దతు తెలుపుతున్నారు.

Also Read : ఇలా తయారయ్యా రేంట్రా బాబు మీరు..!

ప్రధానంగా యూరియా కొరత, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ వంటి విషయాలను వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది. వీటిని తిప్పకొట్టడంలో టీడీపీ పూర్తిగా విఫలమైంది. దీంతో పంటలకు గిట్టుబాటు ధర లేదని, యూరియా కొరత అంటూ వైసీపీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి వైసీపీ నేతలతో పాటు ప్రజలు, రైతులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. వైసీపీ హయాంలో ఇసుక ధర ఆకాశాన్ని దాగింది. ప్రస్తుతం ఉచిత ఇసుక అని చెబుతున్నప్పటికీ.. కొన్ని చోట్ల మాత్రం టీడీపీ నేతలే ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్నారు. అలాగే లిక్కర్ వ్యాపారంలో కూడా సిండికేట్‌గా ఏర్పడి.. విచ్చలవిడిగా బెల్డ్ షాపులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇవన్నీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్కార్‌కు భస్మాసుర హస్తం అవుతున్నాయనే మాట బాగా వినిపిస్తోంది. ఇవన్నీ కూడా వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ భరోసా ఇస్తున్నట్లుగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్