Wednesday, February 4, 2026 06:20 PM
Wednesday, February 4, 2026 06:20 PM

పల్లెల్లో రెపరెపలాడిన పసుపు జెండా

తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ ఘనంగా నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలతో పాటుగా.. గ్రామస్థాయిలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. గత ఐదేళ్లపాటు ఆవిర్భావ దినోత్సవ వేడుకల విషయంలో ఇబ్బంది పడిన పార్టీ కార్యకర్తలు, నాయకులు అధికారంలో ఉండటంతో రెట్టింపు ఉత్సాహంతో వేడుకలను నిర్వహించారు. ఇక మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో కూడా వేడుకలు ఘనంగా పార్టీ అధిష్టానం నిర్వహించింది.

Also Read : నీ తాట తీస్తా.. రెచ్చిపోయిన దువ్వాడ..!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్, పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, మంత్రులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉత్తరాంధ్రలో నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మారుమూల గ్రామాల్లో కూడా టిడిపి శ్రేణులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా జరిపాయి. నాయకులతో సంబంధం లేకుండా.. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. దీనితో పాటుగా పార్టీ అభిమానులు కార్యకర్తలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం గమనార్హం.

Also Read : కొలికిపూడి.. కంట్లో నలుసు..!

ఒకరోజు ముందుగానే జిల్లాలకు చేరుకున్న మంత్రులు ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత ఏడాది ఎన్నికల హడావుడి ఉండడంతో పెద్దగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరపలేదు పార్టీ నాయకత్వం. అటు సోషల్ మీడియాలో టిడిపికి పలువురు శుభాకాంక్షలు చెప్పారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు జనసేన నేతలు, బిజెపి నేతలు ఈ మేరకు పోస్టులు పెట్టారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

పోల్స్