Friday, September 12, 2025 07:18 PM
Friday, September 12, 2025 07:18 PM
roots

ప్రభుత్వం మారినా ఏపీలో ఆగని ఇసుక దందా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇసుక వ్యవహారం ఏ స్థాయిలో దుమారం రేపుతుందో మనకు తెలిసిందే. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులకు సంబంధించి ఎన్నో విమర్శలు చూస్తూనే ఉన్నాం. గత పాలకులు అయితే పెద్ద ఎత్తున ఇసుక అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా అప్పుడు మౌనంగా ఉన్నారు. ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఇసుక అక్రమాల్లో ఉన్నారనే ఆరోపణలు గట్టిగానే వినపడుతున్నాయి. ముఖ్యంగా కొందరు రాజకీయ నాయకుల అనుచరులు ఈ అక్రమాల్లో ఉన్నట్టుగా ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

Also Read : ఈ ఒక్క స్కామ్ చాలు.. వైసీపీ నాయకులందరినీ లోపలేయడానికి

ఎమ్మెల్యేల అనుచరులు, కృష్ణా, గుంటూరు సహా రాయలసీమ జిల్లాల్లో యధేచ్చగా ఇసుక అక్రమాలకూ పాల్పడుతున్నారని స్వయంగా కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. అలాగే ఇసుక వ్యాపారం చేసే వైసీపీ నేతలకు కృష్ణా నదిలో ఇసుక విషయంలో కొందరు టీడీపీ నేతలు సహకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అమరావతికి దగ్గరగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో ఈ విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వైసీపీ నాయకుల వ్యవహారశైలితో విసుగు చెందిన ప్రజలు టిడిపి కి ఏకపక్షంగా అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు టీడీపీ నాయకులు కూడా ఇదే తరహాలో ప్రజలను ఇబ్బందులు పెడుతుంటే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇసుకను కొందరు నేతలు ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని దందా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీని వలన పట్టణాల్లో కంటే గ్రామాల్లో విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, తాడికొండ, కొవ్వూరు సహా పలు నియోజకవర్గాల్లో గ్రామాలకు ఆనుకుని నదులు ఉన్నాయి. వీటి నుంచి యధేచ్చగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. కాబట్టి సర్కార్ దృష్టి పెట్టకపోతే స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత పెరిగి, సంక్షేమ కార్యక్రమాలను అందించినా ఫలితం ఉండదు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ప్రభుత్వ పెద్దలు వీటిపై దృష్టి పెట్టి అరికట్టకపోతే కార్యకర్తల్లోనే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్