జనసేన పార్టీలో చేరికలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చేలా కనపడుతున్నాయి. గత ప్రభుత్వంలో టీడీపీ క్యాడర్ ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిన తాజా మాజీ వైసీపీ నేతలు ఇప్పుడు జనసేన తీర్ధం పుచ్చుకునేందుకు సిద్దం అవుతున్నారు. నిన్న ఏకంగా ముగ్గురు నేతలు జనసేనలో జాయిన్ అయ్యారు. ఒంగోలు నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేనలో జాయిన్ అయ్యారు. ఇతర నేతలతో ప్రస్తుతానికి ఇబ్బంది లేకపోయినా బాలినేని శ్రీనివాస్ రెడ్డి విషయంలో టీడీపీ అసంతృప్తిగా ఉంది.
నిన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ అసలు జనసేన పార్టీ ఎందుకు ఆయన్ను జాయిన్ చేసుకుందో అర్ధం కావడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేసారు. బాలినేని ఎక్కడ ఉన్నా సరే తాను వదిలే సమస్య లేదు అంటూ హెచ్చరించారు. ఇక బాలినేని తమను కేసులు పెట్టి వేధించారు అని, ఇప్పుడు మళ్ళీ ఆయన జనసేనలోకి వచ్చి ఇబ్బందులు పెట్టడం ఖాయం అంటూ మండిపడ్డారు. ఇక హోర్డింగ్స్ లో కూడా తమ ఫోటోలు వద్దు అంటూ టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఏర్పాటు చేసిన వాటిని కూడా పీకించిన సంగతి తెలిసిందే.
Read Also : ఇది వారి బలమా లేక వీరి బలహీనతా?
ఇక బాలినేని చేరిక తర్వాత ఎటువంటి పరిస్థితి ఉండబోతుందో కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొంది. జనసేన నేతలు కూడా ఆయన రాకను ఏ మాత్రం ఇష్టపడటం లేదు. కేవలం ఆయన వర్గం మాత్రమే పండుగ చేసుకుంటుంది. వీటిని గమనించిన అధిష్టానం బహిరంగ సభలు వద్దు సాధారణంగా జాయిన్ కావాలని సూచించింది. ఇక బాలినేనిని ఒంగోలు అసెంబ్లీ కాకుండా మరో అసెంబ్లీ ఇంచార్జ్ గా బాధ్యతలు అప్పగించవచ్చు అనే టాక్ కూడా వస్తోంది. ఇప్పటి వరకు ఒంగోలు కూటమిలో ఏ సమస్యలు లేకపోయినా ఇప్పుడు చీలిక వచ్చే పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఇప్పటికే తన వర్గానికి పలు సూచనలు కూడా చేసారు. జనసేన నేతలు కూడా దామచర్ల మాట వినడం గమనార్హం.