Friday, September 12, 2025 05:16 PM
Friday, September 12, 2025 05:16 PM
roots

వేరే నాయకులు లేరా…? నాగబాబుకే ఎందుకు…?

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ల పర్వం పూర్తయింది. ఎందరో పేర్లు పరిశీలనలోకి వచ్చినా బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య మళ్ళీ తమ రాజ్యసభ స్థానాలను ఖరారు చేసుకున్నారు. అయితే మోపిదేవి వెంకటరమణ స్థానంలో మాత్రం సాన సతీష్ ను రాజ్యసభకు పంపిస్తున్నారు చంద్రబాబు నాయుడు అయితే. ఈ సీటును ముందు నాగబాబుకి ఇవ్వాలని భావించిమా ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని ఖరారు చేయడంతో ఇక సానా సతీష్ నామినేషన్ వేశారు. అయితే ఇప్పుడు నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ క్యాడర్ తీవ్ర స్థాయిలో తప్పుపడుతోంది.

Also Read : సిఆర్డీఏ కమీషనర్ వర్సెస్ నారాయణ… చంద్రబాబు కీలక నిర్ణయం

గతంలో నాగబాబు చేసిన విమర్శలు ఆయన మాట్లాడిన మాటలు అలాగే ఆయన విడుదల చేసిన కొన్ని వీడియోలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణను చంద్రబాబు నాయుడుని అలాగే నారా లోకేష్ ను ఆయన చాలా దారుణంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కంటే కూడా మితిమీరి వ్యాఖ్యలు చేశారు నాగబాబు. 2019 ఎన్నికల సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అలాగే కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కూడా పలుమార్లు నాగబాబు వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

దీనితో ఆయన కు మంత్రి పదవి ఇవ్వడం పట్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జనసేన పార్టీలోనే మంత్రి పదవి ఇవ్వాలి అనుకుంటే చాలామంది నాయకులు ఉన్నారని, లేదంటే వంగవీటి రాధ లాంటి వాళ్లకు ఇచ్చిన బాగుండేదని లేదంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడిన నాయకులు చాలామంది ఉన్నా సరే వాళ్ళను కాదని నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వాలి అనుకోవడం పట్ల ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. భారతీయ జనతా పార్టీ నుంచి కూడా చాలామంది మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read : మంచు రచ్చకు ఎండ్ కార్డ్… షూటింగ్ కు మనోజ్

వారికి ఇచ్చినా ఒక పద్ధతిగా ఉండేదని నాగబాబు లాంటి వ్యక్తికి ఇవ్వటం పట్ల ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారని ఇప్పుడు కేడర్ కూడా పార్టీ పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉంది. కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలి అనుకుంటే చాలామంది నాయకులు ఉన్నారని భారీ మెజారిటీతో గెలిచిన పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇచ్చేసి రాష్ట్ర అధ్యక్షుడుగా మరొకరిని నియమించిన తప్పులేదని అలా కాకుండా నాగబాబుకి ఇచ్చేందుకు అంగీకారం తెలపడం ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధికారిక లెటర్ లో ప్రకటించడం పట్ల ఇప్పుడు క్యాడర్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

భవిష్యత్తులో ఆయనను మంత్రిగా అంగీకరించలేము అంటూ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన పార్టీ క్యాడర్ కూడా కాస్త హడావుడి ఎక్కువగా చేస్తోంది. నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వటం చూసి పచ్చ బ్యాచ్ ఏడుస్తుంది అంటూ రెచ్చగొట్టే కామెంట్లు చేస్తున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్