ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మళ్ళీ తన మార్క్ రాజకీయం మొదలుపెట్టింది. బలహీనంగా ఉన్న ఆ పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో హత్యా రాజకీయాలకు సైతం జగన్ శ్రీకారం చుట్టే అవకాశం కనపడుతుంది. ఇటీవల రాప్తాడులో జరిగిన ఓ ఘటన వ్యవహారాన్ని తనకు అనుకూలంగా వాడుకుంటున్న జగన్ పార్టీ కార్యకర్తలను, నాయకులను తిరిగి రెచ్చగొట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఇక అక్కడి నుంచి పార్టీ నాయకులు మాటల దూకుడు పెంచారు.
Also Read : కిరణ్ ఓకే.. మరి వాళ్ళను ఎందుకు వదిలేసినట్టు..?
ఇక్కడి వరకు బాగానే ఉంది గాని.. జగన్ చేస్తున్న రాజకీయం లేదంటే ఆయన వ్యాఖ్యలు, వైసీపీ నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాల విషయంలో కేబినేట్ నుంచి మాత్రం స్పందన ఉండటం లేదు. ఒక్క మంత్రి కూడా ఘాటుగా వైసీపీ నేతలకు కౌంటర్ ఇవ్వడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. కీలక నాయకులు కూడా మీడియా ముందుకు రావడం లేదు. కనీసం రాయలసీమ జిల్లాలకు చెందిన మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని, మాజీ మంత్రులు గాని ఏ ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి.. వైసీపీ రాజకీయాలను తిప్పికొట్టే ప్రయత్నాలు చేయడం లేదు.
Also Read : వాళ్ళను యాక్టీవ్ చేసిన జగన్.. కూటమి కంట్రోల్ చేస్తుందా..?
గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు వంటి వారు ఘాటుగా, దూకుడుగా రెచ్చ గొడుతున్నా.. ఆయన జిల్లాల నాయకత్వం అసలు మీడియా ముందుకు రావడం లేదు. గతంలో జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే.. వైసీపీ నాయకత్వం మొత్తం విరుచుకుపడిన సందర్భాలు ఉండేవి. కాని ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అధికారంలో లేని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నా సరే.. అధికారంలో ఉన్న కూటమి గాని, టీడీపీ నాయకులు గాని అసలు మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు.