తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక 30 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని గొప్పగా చెప్పిన జగన్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే రెండు పార్టీల నేతలు మాత్రం ఒక తరహా స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. తాము తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని.. ప్రజలకు తమ పాలనలోనే మేలు జరిగిందని పదే పదే చెబుతున్నారు. ఇదే సమయంలో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నేతలు కీలక ప్రకటనలు చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై విస్తృతంగా చర్చ నడుస్తోంది.
Also Read : నిన్ను కొట్టనురా.. వచ్చి కలువురా.. లారెన్స్ ఎమోషనల్
2014లో తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత చిత్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటి వరకు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. అదే సమయంలో తెలంగాణలో ప్రతిపక్షానికి పరిమితమైంది. తెలంగాణ సాధించిన నేతగా కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణలో వరుసగా రెండోసారి కూడా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇటు ఏపీలో మాత్రం వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. రెండు రాష్ట్రాల్లో నియంత పాలన సాగిందనేది వాస్తవం. రాబోయే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే చెప్పారు. ఇటు వైఎస్ జగన్ కూడా రాబోయే 30 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉంటుందని ధీమాగా చెప్పారు. కానీ ఎన్నికల ఫలితాల్లో పరిస్థితి తారుమారైంది.
Also Read : ఉగ్రవాదులకు బరా బర్ మద్దతు ఇస్తాం.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన కామెంట్స్
హ్యాట్రిక్ ఖాయమన్న బీఆర్ఎస్ 2023 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కనీసం బోణీ కూడా కొట్టలేదు. దీనికి తోడు ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. కేటీఆర్, హరీష్ రావు, కవిత మధ్య నువ్వా నేనా అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఇదే సమయంలో బీజేపీ క్రమంగా బలం పుంజుకుంటోంది. 4 పార్లమెంట్ స్థానాలతో పాటు 8 అసెంబ్లీ స్థానాలను కూడా బీజేపీ గెలుచుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటుతామంటున్నారు కమలం పార్టీ నేతలు. ఇదే ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి బలంగా మారుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం మరో పదేళ్లపాటు ఉంటుందని.. తమను దింపేయాలని కొందరు కుట్రలు చేసినా అవి ఫలించలేదన్నారు.అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లకు తగ్గకుండా అధికారంలోకి వస్తుందని.. పదేళ్ల వరకు తామే అధికారంలో ఉంటామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Also Read : మరాఠా గడ్డపై థాక్రేల హగ్ సెన్సేషన్
ఇటు ఏపీలో కూడా ఇదే తరహాలో కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనతో విసిగిపోయిన ఏపీ ప్రజలు.. గత ఎన్నికల్లో ఆ పార్టీని 11 స్థానాలకు పరిమితం చేశారు. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం అదంతా ఈవీఎం ఎఫెక్ట్ అని.. ప్రజలు తమని తప్పక ఆదరిస్తారని ధీమాగా చెబుతున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమ పాలన గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తామన్నారు. అలాగే మరో 15 ఏళ్ల వరకు కూటమి అధికారంలోకనే ఉంటుందన్నారు పవన్. వైసీపీకి ఛాన్స్ ఇచ్చేదే లేదని చెప్పారు. గతంలో కూడా పవన్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. కూటమిని పిడికిలితో పోల్చిన పవన్.. అధికారం మనదే అని చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.
Also Read : జగన్‌లో ఎంత మార్పు వచ్చిందో..!
తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలను ధీటుగా ఎదుర్కొంటున్న రేవంత్‌కు అటు పార్టీలో, ఇటు ప్రజల్లో ఇమేజ్ పెరిగిందనే వాస్తవం. ఇక కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు మరోసారి అవకాశమిస్తాయని మరింత ధీమాగా ఉన్నారు. ఏపీలో కూటమిదే విజయం అని 3 పార్టీల నేతలు చెబుతున్నారు. అమరావతి నిర్మాణ పనులు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాలు, అమలు చేస్తున్న పథకాలతో పాటు చంద్రబాబు, పవన్ ఇమేజ్ కారణంగానే మరో 15 ఏళ్లపాటు మాదే అధికారం అని కూటమి నేతలు ధీమాగా చెబుతున్నారు.




