ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రాజకీయ భవిష్యత్తు ఏంటీ…? ఇప్పుడు దీనిపై రాజకీయ వర్గాల్లో చాలా పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఒకప్పుడు అధికారంలో ఉన్నాం కదా అని విచ్చలవిడిగా ప్రవర్తించి మాట్లాడి, పాలించి తమకు నచ్చింది చేసి… జగన్ ను ఒక దేవుడిగా చూపించిన నేతలు అందరూ ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తుని వెతుకుతూ నానా కష్టాలు పడుతూ వైసీపీ రాజకీయ భవిష్యత్తుని తోక్కేయడం ఆ పార్టీ అధినేత కంటే కార్యకర్తలను బాగా ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పాలి.
ఇప్పుడు తెలుగుదేశం, జనసేన కలిపి చేస్తున్న రాజకీయం జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకు వాళ్ళను నథింగ్ అంటూ తక్కువ అంచనా వేసిన జగన్ కు చుక్కలు ఎలా ఉంటాయో చూపించేందుకు రెండు పార్టీల అధినేతలు సిద్దమయ్యారు. పది మంది మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీ మారడానికి సిద్దమయ్యారు. అందులో ముగ్గురు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసారు. మరో ఇద్దరు పవన్ కోసం ఎదురు చూస్తున్నారు. మిగిలిన వారు ఎప్పుడు వస్తారు అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక పదవుల్లో ఉన్న కొందరు ఇప్పుడు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు.
Read Also : బిజెపి మునిగిపోతున్న టైటానిక్.. కిరణ్ కొండేటి సంచలన రిపోర్ట్
మాజీ ఎమ్మెల్యేలు జనసేనలోకి వెళ్తోంటే… పదవులు ఉన్న వాళ్ళు రాజీనామాలు చేసి టీడీపీలోకి వెళ్తున్నారు. ఈ విషయంలో ఏం జరుగుతుందో జగన్ కు అర్ధమవుతుందో లేదో తెలియదు గాని… ఒక వ్యూహం ప్రకారం వైసీపీ కీలక నేతలు అందరిని బయటకు లాగుతున్నారు. బాలినేని, కేతిరెడ్డి, సామినేని లాంటి వాళ్ళు బయటకు రావడం, మోపిదేవి లాంటి వాళ్ళు రాజ్యసభ పదవులను కూడా వదులుకోవడం అంత చిన్న విషయం అయితే కాదు. ఒక ప్లాన్ ప్రకారం వైసీపీ జెండాను విచ్చిన్నం చేస్తున్నారు. ఆవేశంతో చేసే రాజకీయానికి వ్యూహంతో చేసే రాజకీయానికి చాలా తేడా ఉంటుంది అని రుజువు చేస్తున్నారు. త్వరలోనే మరికొందరు నేతలు వైసీపీ నుంచి బయటకు వస్తారు. పదవులు ఉన్న వాళ్ళు కూడా ఆ జాబితాలో ఉండవచ్చు. ఇద్దరు ఎంపీలకు బిజెపి సైతం గాలం వేసింది. కాబట్టి వైసీపీని మూడు వైపుల నుంచి చీల్చి పంచుకోవడానికి సిద్దమయ్యారు. కాంగ్రెస్ కూడా అవకాశం కోసం కాచుకుని కూర్చుంది అనే మాట వాస్తవం.