ప్రభుత్వంలో ఉండగా అడ్డూ అదుపూ లేకుండా అధికారాన్ని వాడుకున్న సీఎం జగన్ కి ఇప్పుడు స్థానిక తాడేపల్లి వాసులు చుక్కలు చూపిస్తున్నారు. ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్ ఇంటి ముందు రోడ్డు నిర్మాణం కోసం గతంలో తొలగించిన భరతమాత విగ్రహన్ని తిరిగి ఏర్పాటు చేస్తున్నారు తాడేపల్లి వాసులు. సిఎం నివాసానికి వెళ్లే దారిలో నాలుగు రోడ్లు, మధ్యలో డివైడర్, లాన్, వింటేజ్ లైట్లు, స్లైడింగ్ పార్కు ఏర్పాటు కోసం భరతమాత విగ్రహాన్ని తొలగించారు అప్పట్లో. భరతమాత సెంటర్ లో విగ్రహన్ని తొలగించడానికి వీలులేదని అప్పట్లో స్థానికులు ఆందోళన వ్యక్తం చేసారు.
అయినా రాత్రికి రాత్రి 12 అడుగుల భరతమాత విగ్రహన్ని మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తొలగించారు. విగ్రహన్ని భద్రపర్చి రొడ్డు నిర్మాణం తరువాత తిరిగి ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. అయితే విగ్రహన్ని పట్టించుకోకుండా వదిలేయడంతో ఎండకు ఎండి వానకు తడిసి పాడైపోయిన పరిస్థితి. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో జగన్ ఇంటి ముందు రోడ్డును ప్రజల కోసం కూటమి సర్కార్ తెరిచిన సంగతి తెలిసిందే. దీంతో పాత విగ్రహన్ని తిరిగి అక్కడ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేయగా… విగ్రహం విరిగి పోవడంతో తాత్కలికంగా మూడడుగుల విగ్రహం ఏర్పాటు చేసారు.
ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చందాలు వేసుకొని అక్కడ కొత్త విగ్రహన్ని స్ధానికులు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు మూడున్నర లక్షల రూపాయలు ఖర్చతో విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. హనుమాన్ జంక్షన్ లో 12 అడుగుల విగ్రహం తయారు చేయించిన స్ధానికులు… దానిని అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈరోజు ఉదయం భరతమాత విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానికులు నిర్వహిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రజలు చేస్తున్న ఈ పని పై స్వచ్చంద సంస్థలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.




