నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన.. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నటి రియా చక్రవర్తిపై అనుమానాలు రావడంతో.. ఆమెను సిబిఐ అధికారులు విచారించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన రెండు కేసుల్లో సిబిఐ క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది . అతని మరణం వెనుక కుట్ర దాగి ఉందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. ఈ నివేదికలను ముంబై కోర్టుకు సమర్పించారు సిబిఐ అధికారులు.
Also Read : బోరుగడ్డ కేసులో కీలక పరిణామం
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో తన పేరును తొలగించిన తర్వాత నటి రియా చక్రవర్తి సోమవారం ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. ఆమె తల్లిదండ్రులు సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె సోదరుడు షౌవిక్ చక్రవర్తి కూడా ఉన్నాడు. ఇక ఆమె న్యాయవాది మాట్లాడుతూ.. రియా చెప్పుకోలేని కష్టాలను అనుభవించాల్సి వచ్చిందన్నారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తి సారంగ్ కొత్వాల్ ఆమెకు బెయిల్ మంజూరు చేసే వరకు… ఆమె ఎటువంటి తప్పు చేయకుండా 27 రోజులు జైలులో ఉందన్నారు.
Also Read : చంద్రబాబుకు, జగన్‌కు అదే తేడా..!
ఆమె తరుపున వాదించినందుకు తాను ఎంతో గర్వపడుతున్నాను అన్నారు. దేశంలో శక్తివంతమైన న్యాయ వ్యవస్థ ఉందన్నారు సతీష్. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న ముంబైలోని బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో విగత జీవిగా కనిపించాడు. ఆ సమయంలో అతనితో డేటింగ్ చేస్తున్న రియా చక్రవర్తి, ఇతరులు అతని ఆత్మహత్యకు ప్రేరేపించారని అతని తండ్రి ఆరోపణలు చేయడంతో సిబిఐ అధికారులు రంగంలోకి దిగారు. ఈ కేసులో డ్రగ్స్ ఆరోపణలు కూడా రావడంతో ఆమె సోదరుడు షౌవిక్ చక్రవర్తి, సహా పలువురిని అనేక మందిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. సిబిఐ అధికారులు ఆమెను నిర్దోషిగా ప్రకటించడంతో అతని మరణం మిస్టరీగా మిగిలిపోయింది.