Monday, September 15, 2025 03:46 PM
Monday, September 15, 2025 03:46 PM
roots

ఇండియా వర్సెస్ పాక్.. సూర్య కుమార్ సంచలన కామెంట్స్

ఆసియా కప్ లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ను ఆటగాళ్ళు బాయ్ కాట్ చేయాలని డిమాండ్ లు వినిపించాయి. సోషల్ మీడియాలో కూడా ఈ మ్యాచ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. సైనికులు, సాధారణ పౌరుల మనోభావాలకు విలువ లేకుండా వ్యవహరించారని, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు డబ్బులే ఎక్కువ అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో భారత్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Also Read : రిటైర్మెంట్ ఆలోచనలో మరో ముగ్గురు స్టార్లు

ఇక మ్యాచ్ అనంతరం ఆటగాళ్ళు.. పాకిస్తాన్ క్రికెటర్ లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. హెడ్ కోచ్ గంభీర్ ఆదేశాలతో.. షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే మైదానాన్ని వీడారు. ఇదిలా ఉంచితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత క్రికెట్ జట్టు సాధించిన విజయాన్ని భారత సాయుధ దళాలకు అంకితం ఇస్తున్నామని, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో బాధితుల కుటుంబాలకు కూడా తాము అండగా నిలుస్తామని వ్యాఖ్యానించాడు. ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే.

Also Read : మెగా ఫ్యాన్స్ కు 18 ఇయర్స్ గిఫ్ట్ రెడీ

ఇది పాకిస్తాన్ కు రిటర్న్ గిఫ్ట్ అని కామెంట్ చేసాడు. పాకిస్తాన్ ను ఓడించడం గొప్ప అనుభూతిగా వర్ణించాడు. అవకాశం దొరికిన ప్రతీసారి పాకిస్తాన్ ను ఓడిస్తునే ఉంటామన్నాడు. భారత సాయుధ దళాలు ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించాయని, వారి త్యాగాలకు ఎప్పుడూ రుణపడి ఉంటామన్నాడు. కాగా ఈ మ్యాచ్ లో విజయంతో భారత్ దాదాపుగా ఫైనల్ కు అర్హత సాధించింది. రెండు మ్యాచుల్లో రెండు విజయాలతో భారత్ జోరు మీదుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఐటీ రిటర్న్ కు...

ఆదాయపు పన్ను దాఖలు విషయంలో సంబంధిత...

యూరియా వాడితే క్యాన్సర్.....

ఏపీ సచివాలయం 5వ బ్లాక్ లో...

సజ్జలను లైట్ తీసుకోండి.....

గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ...

భోగాపురంలో ఫస్ట్ విమానం...

ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి...

వైసీపీ నేతలకు ఆ...

ఏపీలో మెడికల్ కాలేజీల రగడ తారాస్థాయికి...

సజ్జల ప్రకటనతో వైసీపీలో...

వైసీపీ అధికారంలోకి వస్తే.. అమరావతి రాజధాని...

పోల్స్