Tuesday, October 28, 2025 06:59 AM
Tuesday, October 28, 2025 06:59 AM
roots

మరో రోహిత్.. సూర్యకుమార్ ను యువ ఆటగాళ్లే కాపాడారా..?

ఇండియన్ క్రికెట్ లో కెప్టెన్ లకు గడ్డు కాలం నడుస్తోంది. టెస్ట్ క్రికెట్ లో అలాగే టి20 క్రికెట్లో కెప్టెన్లు అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో కెప్టెన్ రోహిత్ శర్మ ఘోరంగా విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత రంజీల్లో కూడా పెద్దగా ప్రదర్శనలు చేయలేదు. దీనితో అతనిని జట్టు నుంచి తప్పించాలని.. అతను క్రికెట్ కి గుడ్ బై చెప్పాలని చాలామంది డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇక తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన టి20 సిరీస్ లో కూడా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆశించిన స్థాయిలో రాణించలేదు.

Also Read: రికార్డుల దుమ్ము దులిపిన యువీ శిష్యుడు

ఈ సీరిస్ భారత్ 4-1 తేడాతో గెలిచింది కాబట్టి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ సూర్య కుమార్ యాదవ్ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివం దుబే, హార్దిక్ పాండ్యా వంటి వాళ్ళు అంచనాలకు మించి రాణించడంతో సూర్య కుమార్ యాదవ్ ను పెద్దగా పట్టించుకోలేదు. ఐదు ఇన్నింగ్స్ లలో అతను చేసిన పరుగులు ఒకసారి చూస్తే మొదటి మ్యాచ్ లో డక్ ఔట్.. కాగా రెండో మ్యాచ్లో 12 పరుగులు చేశాడు. ఇక మూడో మ్యాచ్ లో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక నాలుగో మ్యాచ్ లో కూడా డక్ ఔట్ అయ్యాడు. ఇక చివరి మ్యాచ్ లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు.

Also Read: జంప్ డిపాజిట్… నయా సైబర్ క్రైమ్..!

సౌత్ ఆఫ్రికా పర్యటనలో కూడా యువ ఆటగాళ్లు రాణించడంతో సూర్యకుమార్ యాదవ్ ను పెద్దగా టార్గెట్ చేయలేదు. కానీ ఆటగాడిగా మాత్రం ఈ సీనియర్ ప్లేయర్ నిరాశ పరుస్తున్నాడు. లెగ్ సైడ్ సిక్స్ కొట్టే క్రమంలోనే అతను ఎక్కువగా అవుట్ అయ్యాడు. అన్ని మ్యాచుల్లో ఒకే విధంగా అవుట్ అవుతున్నా తన పద్దతి మార్చుకోకపోవడం అభిమానులని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. అతని వీక్నెస్ ను టార్గెట్ చేసిన ఇంగ్లాండ్ బౌలర్లు పదేపదే అవే బంతులు వేయడంతో సిక్స్ కు ప్రయత్నించి క్యాచ్ అవుట్ గా వెను తిరిగాడు. దీనితో సూర్యకుమార్ యాదవ్ కూడా దేశవాళీ క్రికెట్ ఆడాలి అనే డిమాండ్లు వినపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్