ఈ మధ్య కాలంలో క్రికెటర్లు సినిమాలపై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు రావడంతో నటించడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్ ఇలా కొందరు ఆటగాళ్ళు క్రికెట్ తర్వాత సినిమాలపై ఆసక్తి చూపించారు. తాజాగా మరో క్రికెటర్ కూడా సినిమాల్లోకి అడుగు పెట్టేందుకు రెడీ అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఐపిఎల్ లో ఆడిన సురేష్ రైనాకు ఓ తమిళ సినిమాలో మంచి ఆఫర్ వచ్చింది. దీనితో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.
Also Read : తెలుగు సైనికుడి జీవిత కథతో సల్మాన్ సినిమా
క్రికెట్ ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఓ కొత్త నిర్మాణ సంస్థలో నిర్మాత శరవణ కుమార్ నిర్మించనున్నారు. సినిమా టైటిల్ ను ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. విదేశీ పర్యటనలో ఉన్న సురేష్ రైనా.. వచ్చిన తర్వాత సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. సురేష్ రైనాతో పాటుగా మరో చెన్నై ఆటగాడు శివం దుబే కూడా సినిమాలో నటించే అవకాశం ఉంది. క్రికెటర్ పడే కష్టాలను ఈ సినిమాలో చూపించే అవకాశం ఉంది.
Also Read : ఉగ్రవాదులకు బరా బర్ మద్దతు ఇస్తాం.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన కామెంట్స్
క్రికెటర్ జీవితంలోని కష్టాలతో పాటుగా ఓ పేదింటి యువకుడు క్రికెటర్ గా ఎలా మారాడు అనే దానిపై సినిమాను ప్లాన్ చేసారు. అయితే ఇది విషాద గాధ అంటోంది తమిళ మీడియా. క్రికెటర్ కెరీర్ ఎలా ఎండ్ అయిపొయింది అనే టాపిక్ తీసుకున్నట్టు ప్రచురించింది. సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉంది. ఐపిఎల్ సీజన్ ప్రారంభం అయిన తర్వాత సినిమాను విడుదల చేయవచ్చు అంటున్నాయి సినీ వర్గాలు. ఈ సినిమాలో నటించేందుకు సురేష్ రైనా దాదాపు 8 కోట్లు తీసుకుంటున్నాడట.