మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సుప్రీం కోర్ట్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. వివేకా హత్యకేసు నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కే. సింగ్ ధర్మాసనం విచారణ జరిపింది. అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ సునీత తరపు లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గడువు విధించినందు వల్లే దర్యాప్తును ముగించినట్లు సీబీఐ చెబుతోందని కోర్ట్ దృష్టికి తీసుకు వెళ్ళారు.
Also Read : ఇక నా వల్ల కాదు.. ఫ్రీ సర్వీస్ ప్లీజ్..!
వివేకా హత్య కేసులో మరింత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది.. సూత్రధారులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. నిందితులు సాక్ష్యులను బెదిరించడమే కాకుండా సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని, సునీత దంపతులతో పాటు సీబీఐ అధికారి రాంసింగ్ పైనా కేసు పెట్టారు లూథ్రా వాదించారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్ట్, వివేకా కుమార్తె, అల్లుడు నెర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్ పై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామన్న సుప్రీం ధర్మాసనం, వెంటనే కేసులను క్వాష్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Also Read : వైసీపీకి టీడీపీ బంపర్ ఆఫర్..!
చట్టాన్ని దుర్వినియోగం చేసేందుకు కేసు పెట్టారని ధర్మాసనం మండిపడింది. ఇక అవినాష్ రెడ్డే వివేకా హత్య కేసులో మాస్టర్ మైండ్ అని సిద్ధార్థ లూథ్రా తన వాదనలు వినిపించారు. అటు సిబిఐ కూడా బలమైన వాదనలు వినిపించింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయొచ్చని సీబీఐ అభిప్రాయపడింది. నిందితులు సాక్షాలను ధ్వంసం చేశారు.. ముందు గుండెపోటు అని ప్రచారం చేశారని సిబిఐ తరుపు న్యాయవాది కోర్ట్ కు వివరించారు. మరింత దర్యాప్తు అవసరమా లేదా అన్నదానిపై సిబిఐ పిటిషన్ వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటివరకు విచారణ పెండింగ్ పెడతామని తెలిపింది. తుది విచారణ సెప్టెంబర్ 9 కి వాయిదా వేసింది.