Tuesday, October 28, 2025 01:55 AM
Tuesday, October 28, 2025 01:55 AM
roots

బెయిల్ ఇవ్వని సుప్రీం కోర్ట్.. అరెస్ట్ వద్దన్న ఏసీబీ కోర్ట్..!

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో విచారణ వేగంగా జరుగుతున్నా కొన్ని పరిణామాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆయనను ఎలాగైనా అరెస్ట్ చేయాలని, కస్టడీకి తీసుకోవాలని సిట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీం కోర్ట్ లో మిథున్ రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ కూడా కొట్టేసారు.

Also Read : మిథున్ కోసం సిట్ జల్లెడ.. ఎక్కడున్నాడో..?

హైకోర్ట్ లో షాక్ తగలడంతో సుప్రీం కోర్ట్ కు వెళ్ళారు మిథున్ రెడ్డి. అక్కడ కూడా ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీనితో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయమని భావించారు అందరూ. ఇక సుప్రీం కోర్ట్ కూడా తీర్పు ఇవ్వడంతో.. సిట్ అధికారులు వెంటనే.. ఏసీబీ కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. ఆయన అరెస్ట్ కు అనుమతి ఇవ్వాలంటూ కోర్ట్ ను కోరారు. పిటీషన్ ను విచారించిన జడ్జి.. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

Also Read : కలవలేదు.. అయినా కలిస్తే తప్పేంటి..?

మిథున్ రెడ్డి విచారణకు సహకరిస్తున్నారా అని కోర్ట్ అడిగగా.. ప్రభుత్వ తరుపు లాయర్ అవును అని సమాధానం ఇచ్చారు. విచారణ చేయాలని, అరెస్ట్ చేయవద్దు అంటూ కోర్ట్ పేర్కొంది. సాంకేతిక కారణాలను కూడా పరిశీలించిన కోర్టు, అరెస్ట్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. సుప్రీం కోర్ట్ బెయిల్ పిటీషన్ డిస్మిస్ చేసిన తర్వాత అరెస్ట్ చేయవద్దని ఏసీబీ కోర్ట్ చెప్పడం చూసి సామాన్య ప్రజలు సైతం కంగుతిన్నారు. ఈ కేసు విచారణలో మిథున్ రెడ్డి అరెస్ట్ అత్యంత కీలకంగా మారింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్