వైసీపీ నేత, మాజీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధమవుతున్నట్లుగానే కనపడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సోషల్ మీడియాలో సజ్జల భార్గవ్ రెడ్డి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు, అభ్యంతరకర పోస్టులు పెట్టించాడు సజ్జల భార్గవ్. దీనిపై అప్పట్లో టిడిపి నేతలతో పాటుగా జనసేన కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Also Read : ఈడీకి సుప్రీం బ్రేకులు.. చీఫ్ జస్టీస్ సంచలన వ్యాఖ్యలు
తండ్రి ప్రభుత్వంలో కీలకంగా ఉండటంతో భార్గవ్ రెడ్డి ఇష్టానుసారం వ్యవహరించాడు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భార్గవ్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చాలామంది భావించారు. కానీ భార్గవ్ రెడ్డి అరెస్ట్ క్రమంగా ఆలస్యం అవుతూ వస్తోంది. అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదయింది. ఈ తరుణంలో తనకు ముందస్తు బెయిల్ కావాలని భార్గవ్ రెడ్డి సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
Also Read : ఆ ప్రశ్నలకు మాత్రం నో ఆన్సర్..!
ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని రెండు వారాల గడువు ఇచ్చింది కోర్ట్. ఇలాంటివి ఎవరు చేసినా తప్పేనని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలాంటి తప్పులు ఎవరు చేసినా సరే వ్యవస్థ ఖచ్చితంగా శిక్షిస్తుంది అని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదని అనుకున్నారా అంటూ నిలదీసింది. మీరు ఏ ఆలోచనతో పోస్టులు పెట్టారో మేము అర్థం చేసుకోలేమా అంటూ కామెంట్ చేసింది. అరెస్టు నుంచి రెండు వారాలు మాత్రమే ఉపశమనం కల్పించగలమని ఆదేశాలు ఇచ్చింది. దీనితో సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ దాదాపుగా ఖాయం అయినట్లుగానే కనపడుతుంది.