Saturday, September 13, 2025 01:23 AM
Saturday, September 13, 2025 01:23 AM
roots

హైదరాబాద్ నిలుస్తుందా.. ఆ ఇద్దరిపైనే వదిలేస్తుందా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ లో భాగంగా బుధవారం, ఏప్రిల్ 23న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ మైదానంలో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ముంబై గత రెండు మూడు మ్యాచుల నుంచి కాస్త లైన్ లో పడినా.. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని సన్ రైజర్స్ మాత్రం ఇంకా గాడిలో పడలేదు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో దుమ్ము రేపిన హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్.. తర్వాత మళ్ళీ తడబడింది.

Also Read : బీసిసిఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టు ఇదే

ఈ సీజన్‌లో హైదరాబాద్ ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పటివరకు జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండవ స్థానంలో నిలిచారు. ఇక ఓపెనింగ్ ద్వయం అభిషేక్ శర్మ – ట్రావిస్ హెడ్‌పై అతిగా ఆధారపడటం కూడా హైదరాబాద్ కు మైనస్ గా మారింది. ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్ లో రాణించినా ఆ తర్వాత మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. కీలక మ్యాచుల్లో సైతం చేతులు ఎత్తేశాడు.

Also Read : ఇంగ్లాండ్ టూర్ కు వెళ్తాడా..?

బౌలింగ్ కూడా పూర్తిగా విఫలమైంది. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అంచనాలను అందుకోలేకపోయాడు. బౌలింగ్ విభాగంలో హైదరాబాద్ కు హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ మాత్రమే కాస్త పర్వాలేదు అనిపిస్తున్నారు. ఇక ముంబై విషయానికి వస్తే.. ముందు కాస్త ఇబ్బంది పడినా ఆ తర్వాత మాత్రం లైన్ లోకి వచ్చింది అనే చెప్పాలి. మ్యాచ్ చేజారిపోయిన సందర్భాల్లో కూడా డ్రెస్సింగ్ రూమ్ నుంచి అందిన సహకారంతో ముంబై గాడిలో పడింది. ఇక హైదరాబాద్ పై ఐపిఎల్ చరిత్రలో ముంబైదే ఆధిపత్యం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్