Saturday, September 13, 2025 03:15 AM
Saturday, September 13, 2025 03:15 AM
roots

ఎవరు ఓడినా ఇంటికే.. ఐపీఎల్ లో కీలక మ్యాచ్

ఒకప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టేది. బ్యాటింగ్ తో పాటుగా బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆ జట్టు చాలా బలంగా ఉండేది. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు మాత్రం నానా తంటాలు పడుతోంది. కీలక మ్యాచ్ ల్లో సైతం విజయం సాధించలేక.. గెలిచే అవకాశాలు ఉన్న సందర్భంలో కూడా చేజార్చుకుంటూ చెన్నై జట్టు ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది. ఇటీవల కెప్టెన్ మారిన సరే చెన్నై తలరాత మాత్రం మారలేదు.

Also Read : హమ్మయ్య రోహిత్ వచ్చేసాడు.. ఇంగ్లాండ్ టూర్ ముందు గుడ్ సిగ్నల్

ఇక నేడు ఐపీఎల్ లో అత్యంత కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ కి వెళ్లడానికి ఎంతో కొంత అవకాశం ఉంటుంది. ఈ రెండు జట్లు చివర నుంచి ఒకటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక హైదరాబాద్ జట్టు విషయానికొస్తే బ్యాటింగ్ విభాగంలో అత్యంత బలంగా కనపడిన హైదరాబాద్ జట్టు ఆ తర్వాత మాత్రం తడబడింది ఓపెనర్ల పైన ఎక్కువగా హైదరాబాద్ బ్యాటింగ్ ఆధారపడింది.

Also Read : నీటి నుంచి క్రికెట్ వరకు.. పాకిస్తాన్ కు మోడీ షాక్

ఇక చెన్నైలో కూడా హైదరాబాద్ జట్టుకు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ధోని సారథ్యంలో ఆడుతున్న చెన్నై జట్టు ఎలాగైనా సరే.. ఈ మ్యాచ్లో గెలిచి టోర్నీలో నిలవాలని పట్టుదలగా ఉంది. అయితే రెండు జట్లకు మిడిల్ ఆర్డర్ సమస్య ఇబ్బందికరంగా మారింది. ఒకవైపు ఇతర జట్లు మిడిల్ ఆర్డర్ సహాయంతో పరుగుల వరద పారిస్తుంటే చెన్నై, హైదరాబాద్ మాత్రం ఓపెనర్ల పైన ఎక్కువగా ఆధారపడే పరిస్థితి. మరి ఈ మ్యాచ్లో గెలిచి.. నిలుస్తారా లేదంటే లీగ్ మ్యాచ్ లతోనే సరిపెట్టుకుంటారా అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్