గత ఏడాది జూన్ లో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఎట్టకేలకు తిరిగి భూమి మీదకు చేరుకుంటున్నారు. కొన్ని గంటల్లోనే ఆమెను భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు వేగవంతం చేసింది. 8 రోజుల టెస్ట్ మిషన్ కోసం అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన సునీత విలియమ్స్.. తొమ్మిది నెలలుగా అక్కడే ఉండిపోయారు. రెండు రోజుల క్రితం వారిని తీసుకువచ్చేందుకు ఒక వ్యోమనౌక అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు వెళ్ళింది.
Also Read : రంగన్న శరీరంలో 20 నమూనాలు.. పోలీసులు కీలక విచారణ
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో సునీత విలియమ్స్ గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె తీసుకునే జీతం గురించి కూడా నేటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అమెరికా ప్రభుత్వం గ్రేడ్ పే ప్రకారం నాసా శాస్త్రవేత్తలకు జీతం ఇస్తుంది. ఇందులో పౌర వ్యోమగాములకు జీఎస్ 13 జిఎస్ 15 గ్రేడ్ పే కింద జీతాలు చెల్లిస్తారు. జీఎస్ 15 అనేది అత్యధిక పే. సునీత విలియమ్స్ కూడా జిఎస్ 15 గ్రేడ్ పే ప్రకారమే జీతం అందుకుంటారు. జిఎస్ 13 ప్రకారం వార్షిక వేతనం 81 వేల 216 డాలర్లు ఉంటుంది.
Also Read : అధినేతపై తెలుగు తమ్ముళ్ల విమర్శలు..!
అంటే భారత కరెన్సీలో దాదాపు 78 లక్షలు. ఇదే పే ప్రకారం అత్యధిక వేతనం 1,05,000 డాలర్లు ఉంటుంది. అంటే 92 లక్షలు మన కరెన్సీలో. ఇక జీఎస్ 15 వార్షిక వేతనం విషయానికొస్తే 1,12,890 డాలర్లు చెల్లిస్తారు. అంటే మన కరెన్సీలో దాదాపు సంవత్సరానికి 98 లక్షలు. ఇక ఇందులో అత్యధిక వేతనం 1,46,757 డాలర్లు ఉంటుంది. మన కరెన్సీ ప్రకారం కోటి 27 లక్షలు సంవత్సరానికి చెల్లిస్తారు.
Also Read : ఉగాండా అధ్యక్షుడితో కేసీఆర్ పోటీ.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
పైగా వారికి… ఆహార నివాస ఖర్చులను కూడా అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది. ఇక ఇలా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు వెళ్ళినప్పుడు వారికి సంబంధించిన ప్రతి ఖర్చుతో పాటుగా అదనపు జీతాన్ని కూడా అమెరికా ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పుడు సునీత విలియమ్స్ దాదాపుగా మూడు రెట్లు అత్యధిక జీతాన్ని అందుకోనున్నట్ల అంతర్జాతీయ మీడియా పేర్కొంది.