ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టీం ఇండియా స్టార్ ఆటగాడు కెఎల్ రాహుల్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్ లో రాహుల్ ఆట తీరు విమర్శకుల ప్రసంశలు అందుకుంది. బెంగళూరు వేదికగా.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో రాహుల్ ఆట తీరు మాజీ క్రికెటర్లు ప్రసంశల వర్షం కురిపించారు. ఆ తర్వాత కూడా రాహుల్ విలువైన ఇన్నింగ్స్ లు ఆడాడు. అది అలా ఉంచితే బెంగళూరులో రాహుల్ చేసుకున్న సెలెబ్రేషన్ సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read : రాహుల్ – కోహ్లీ మధ్య వార్.. సోషల్ మీడియా ఓవరాక్షన్
తన ఫెవేరేట్ సినిమా కాంతారాలో సీన్ అని, ఆ సెలెబ్రేషన్ చేసుకున్నా అంటూ రాహుల్ మ్యాచ్ అనంతరం చెప్పిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై అతని మామ, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్.. మ్యాచ్ కు ముందు స్టార్ స్పోర్ట్స్ లో మాట్లాడిన సునీల్ శెట్టి.. బెంగళూరులో ఆ క్షణాన్ని తాను ఎంతగా ఆస్వాదించానో చెప్పడానికి కెఎల్ రాహుల్‌కు వ్యక్తిగతంగా ఫోన్ చేశానని గుర్తు చేసుకున్నాడు. ఆ సెలెబ్రేషన్ తనకు ఎంతో నచ్చింది అన్నాడు సునీల్ శెట్టి.
Also Read : టీమిండియాకు మరో సచిన్ దొరికినట్లేనా..!
నాకు అది చాలా నచ్చిందని కామెంట్ చేసాడు. ఇప్పుడు చూసినా కూడా నాకు గూస్ బంప్స్ వస్తాయన్నాడు. ప్రతి క్రికెటర్‌కీ అలాంటి క్షణం ఉండాలన్నాడు సునీల్ శెట్టి. రాహుల్.. నేను సాధించగలను అని నమ్ముతాడని.. అతను మరింత మెరుగైన ప్రదర్శనలు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేసాడు. సోషల్ మీడియా కారణంగా రాహుల్ చాలా ఒత్తిడికి గురయ్యాడని, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన అతని సామర్ధ్యాన్ని చూపించిందని కొనియాడాడు. బెంగళూరులో, అతను 53 బంతుల్లో 93 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.