పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో వచ్చిన ఓ జీ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఫ్యాన్ బాయ్ రేంజ్ లో పవన్ ను ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేసే రేంజ్ లో చూపించాడు సుజిత్. ఆరేళ్ళ పాటు వర్క్ చేసిన స్క్రిప్ట్ ను పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసిన సుజిత్.. పవన్ సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేసాడు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అలాగే మెగా ఫ్యాన్స్ ఆకలి కూడా సుజిత్ తీర్చడంలో సుజిత్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. దీనితో సినిమాకు భారీ వసూళ్లు రావడం ఖాయంగా కనపడుతున్నాయి.
Also Read : గంభీరంగా గర్జించిన ఓజీ.. థియేటర్ లలో సింహగర్జన..!
ఇక సెంటిమెంట్ విషయానికి వస్తే.. పవన్ గతంలో మాఫియా బ్యాక్ గ్రౌండ్ లేదా గ్యాంగ్ స్టర్ తరహాలో చేసిన కథలు హిట్ కాలేదు. బాలు, కొమరం పులి, పంజా వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. కానీ ఇప్పుడు దాదాపు అదే బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఓ జీ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దీనితో పవన్ ఫ్యాన్స్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడంలో దాదాపుగా సుజిత్ సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. అటు నార్మల్ ఆడియన్స్ కు కూడా సినిమా నచ్చేసింది.
Also Read : జీఎస్టీ ఎఫెక్ట్.. ఏపీలో భారీగా వాహనాల అమ్మకాలు..!
ఈ సినిమాతో పవన్ మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చినట్టుగానే కనపడుతోంది. హరిహర వీరమల్లు ఫ్లాప్ తో డల్ అయిన ఫ్యాన్స్ కు ఇది మంచి బూస్ట్ ఇచ్చే సినిమా అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత పవన్.. ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పుడు వచ్చిన బూస్ట్ తో.. పవన్ ఫ్యాన్స్ కూడా ఆ సినిమా కోసం ఎదురు చూడవచ్చు.