Saturday, October 25, 2025 10:50 AM
Saturday, October 25, 2025 10:50 AM
roots

ఆ ముగ్గురు.. వారి వారసులు.. తేడా ఎందుకిలా..?

రాజకీయాల్లో కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరి ఆసక్తిగా కనిపిస్తాయి కూడా. ఇప్పుడు ఒకే టాపిక్ మీద తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. అదే రాజకీయాల్లో వారసులు. ముగ్గురు సమకాలీకులు.. ఒకేస్థాయి నేతల గురించి జోరుగా చర్చ నడుస్తోంది. ఆ ముగ్గురి రాజకీయ ప్రస్థానం.. వారసత్వం పైన ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఆ ముగ్గురే నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

Also Read : రెడ్ బుక్ నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్..!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒకటే హాట్ టాపిక్. అదే కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం. దీంతో కుటుంబాల్లో అధికారం కోసం ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుందనే మాట బాగా వినిపిస్తోంది. చంద్రబాబు, వైఎస్ఆర్ ఒకే సమయంలో ఎన్నికల్లోకి వచ్చారు. వారి వెంటే కేసీఆర్ కూడా. ఈ ముగ్గురిలో సీబీఎన్, వైఎస్ఆర్, కేసీఆర్ రికార్డు ఒకటే. వరుసగా రెండోసారి కూడా సీఎం అయ్యారు. అలాగే ఈ ముగ్గురికీ కుమారులు కూడా ఒక్కరే. అయితే వైఎస్, కేసీఆర్ కుటుంబంలో మాత్రం ఆధిపత్య పోరు నడుస్తోంది. అలాగే వివాదాలు కూడా.

చంద్రబాబుకు లోకేష్ ఒక్కటే కొడుకు కావటంతో ఆయన తర్వాత ఎవరూ అనే విషయంలో వివాదం లేదు. కానీ వైఎస్, కేసీఆర్ కుటుంబంలో ఆస్తి వివాదం, రాజకీయ గుర్తింపు కోసం ఆడపిల్లలు పోరాటం చేస్తున్నారు. మరో కీలకమైన విషయం ఏమిటంటే.. లోకేష్ పైన అవినీతి ఆరోపణలు ఇప్పటి వరకు లేవు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అంటూ వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలు కూడా పూర్తిగా రాజకీయ వేధింపులే అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ వైఎస్ఆర్ కుమారుడు జగన్ పైన అక్రమాస్తుల కేసు ఉంది. ఇప్పటికే 16 నెలలు జైలు జీవితం కూడా గడిపారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పైన కూడా ఫార్మూలా ఈ రేస్ నిర్వహణలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే 2 సార్లు ఏసీబీ విచారణకు కూడా హాజరయ్యారు. ఈ కేసులో కేటీఆర్ అరెస్టు ఖాయమనే మాట కూడా వినిపిస్తోంది.

Also Read : కవిత ఆ పని చేస్తే కామెడీ అవుతారా..?

వీటికి తోడు జగన్, కేటీఆర్ సొంత చెల్లెళ్లు షర్మిలా, కవిత ఇప్పటికే బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. షర్మిల ఆస్తి కోసం, గుర్తింపు కోసం పోరాడుతుంటే.. కవిత పార్టీలో ఆధిపత్యం కోసం ప్రత్యక్ష పోరాటం చేస్తోంది. ఇక జగన్, కేటీఆర్, లోకేష్ గురించిన మరో అంశంపై కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. రాజకీయ, వ్యక్తిగత వ్యాఖ్యలు, విమర్శలు చేయడంలో ముగ్గురి మధ్య పోలిక గురించి చర్చించుకుంటున్నారు. జగన్, కేటీఆర్ తమ నోటీ దురుసుతో ఇప్పటికే విమర్శలకు గురయ్యారు. బూతులు తిట్టడం, నోటికి వచ్చినట్లు వ్యాఖ్యానించడం వల్ల ప్రజల్లో చెడ్డపేరు వచ్చింది కూడా. కానీ లోకేష్ ఇప్పటి వరకు అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు కనిపించ లేదు. ఇక జగన్, కేటీఆర్‌లు ఇద్దరు సొంత చెల్లెళ్లను కూడా దగ్గరకు తీయలేదనే మాట వినిపిస్తుంటే.. లోకేష్ మాత్రం.. కుటుంబ సభ్యులందరినీ కలుపుకుంటూ పోతున్నారు. దీంతో వారి పెంపకంలో లోపం ఎక్కడా అనే చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా నడుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న...

భారత వాతావరణ శాఖ (IMD) తాజా...

దారితప్పిన వారిపై వేటు...

https://www.youtube.com/watch?v=O6ejiO-k3W8

ఆ ఇద్దరినీ వదలను.....

పదే పదే విమర్శలు.. ఒకరిపై ఒకరు...

కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్...

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు...

కంపెనీ ట్రిప్ కోసం...

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు...

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

పోల్స్