Friday, September 12, 2025 05:30 PM
Friday, September 12, 2025 05:30 PM
roots

1 కాదు.. 2 కాదు.. మూడు.. రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ లెక్క మారింది…!

రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చే సినిమా గురించి, రోజుకు ఒక న్యూస్ బయటకు వస్తూనే ఉంది. ఏదో ఒక న్యూస్ తో సోషల్ మీడియాలో జనాలు హడావుడి చేస్తూనే ఉన్నారు. చిన్న విషయం బయటకు వచ్చినా సరే దాని గురించి పెద్ద రచ్చ రచ్చ జరుగుతుంది. అది ఎంతవరకు నిజమనే క్లారిటీ లేకపోయినా సోషల్ మీడియా జనాలు మాత్రం వైరల్ చేసేస్తున్నారు .లేటెస్ట్ గా ఈ సినిమా గురించి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా కథ చాలా పెద్దదని ఒకటి రెండు పార్ట్ లలో చెప్పడం కష్టమనే అభిప్రాయంలో రాజమౌళి ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Also Read : ఎన్సియేలో బూమ్రా.. ఛాంపియన్స్ ట్రోఫీ కష్టమేనా..??

ఈ సినిమాను మూడు భాగాలుగా ప్లాన్ చేసేందుకు రాజమౌళి సిద్ధపడుతున్నట్లుగా సమాచారం. ఆఫ్రికా అడవుల తో పాటుగా అమెజాన్ అడవుల్లో కూడా ఈ సినిమా షూటింగ్ జరగనుంది. సినిమా కథ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో రానుంది. దీనితో కథను చాలా పవర్ ఫుల్ గా ప్లాన్ చేశారు రచయిత విజయేంద్రప్రసాద్. ఇది రెండు భాగాలుగా వచ్చినా కంప్లీట్ అవ్వదని, కాబట్టి కథ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, మూడు భాగాలుగా సినిమాను తీసుకురావాలని 2029 మే నాటికి మూడు పార్ట్ లను కంప్లీట్ చేయాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : తెలంగాణాపై ఫోకస్.. లోకేష్ ఢిల్లీలో ఇంట్రస్టింగ్ సీన్..!

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను ఫైనల్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె హీరోయిన్ కాదని, ఆమెది నెగిటివ్ రోల్ అని కొంతమంది అంటున్నారు. మహేష్ బాబు పాత్రకు ఎంత వెయిట్ ఉంటుందో ఆమె పాత్ర కూడా అదే రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోనే అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. త్వరలోనే కెన్యాలో షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో విలన్ ఎవరు అనేదానిపై క్లారిటీ రావటం లేదు. ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలను పరిశీలిస్తున్నట్లుగా ఈ మధ్య ప్రచారం మొదలైంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్