Friday, August 29, 2025 07:03 PM
Friday, August 29, 2025 07:03 PM
roots

ఆలోచన మానుకోండి.. లేదంటే..!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కొన్ని ప్రాంతాల మధ్య విబేధాలకు కారణం అవుతోంది. ఏపీలో 6 కొత్త జిల్లాలు ఏర్పడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అమరావతి జిల్లా, పలాస జిల్లా, మార్కాపురం జిల్లా, గూడూరు జిల్లా, మదనపల్లె జిల్లా, ఆదోని జిల్లా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటిల్లో మిగిలిన ప్రాంతాలపై ఎలాంటి ఇబ్బందులు లేకున్నప్పటికీ.. మార్కాపురం కేంద్రంగా ఏర్పడే జిల్లా విషయంలో మాత్రం రెండు ప్రాంతాల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.

Also Read : వరకట్న నిషేధ చట్టం అంటే ఏంటీ..? శిక్షలు ఏంటీ..?

మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, కనిగిరి నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పడనుంది. అయితే ఈ ప్రాంత వాసులు మరో కోరిక కూడా కోరుతున్నారు. అదే ఇప్పుడు అసలు సమస్యకు కారణమైంది. మార్కాపురం పట్టణానికి శ్రీశైలం కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. పైగా కృష్ణా నది నుంచి నీటి తరలింపు కోసం నిర్మిస్తున్న వెలుగొండ ప్రాజెక్టు పూర్తిగా పశ్చిమ ప్రకాశం పరిధిలోనే ఉంది. అలాగే శ్రీశైలం వెళ్లే యాత్రికులకు మార్కాపురం రైల్వే స్టేషన్ మాత్రమే అందుబాటులో ఉన్న దగ్గర స్టేషన్. వీటికి తోడు.. శ్రీశైలం పుణ్యక్షేత్రం పరిధిలోని అన్ని సత్రాలకు సరుకులు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు మార్కాపురం నుంచే వెళ్తున్నాయి. అలాగే వ్యాపారస్తులు కూడా ఎక్కువ మంది మార్కాపురం ప్రాంతంలో సంబంధాలున్న వారే. దీంతో ఈ డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది.

Also Read : ట్రంప్ మరిన్ని సుంకాలు..? బుజ్జగిస్తోన్న ఆయిల్ కంపెనీలు..?

అయితే నిన్నటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం.. ప్రస్తుతం నంద్యాల జిల్లా పరిధిలో ఉంది. పుణ్యక్షేత్రంతో పాటు ప్రముఖ పర్యాటక క్షేత్రంగా కూడా శ్రీశైలం గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆదాయం కూడా భారీగానే వస్తుంది. దీంతో ఈ ప్రాంతం వదులుకునేందుకు నంద్యాల జిల్లా వాసులు ఏ మాత్రం సుముఖత చూపటం లేదు. రాయలసీమ ప్రాంతంలో శ్రీశైలం ఒక భాగమని.. కాబట్టి ఇప్పుడు మార్చడం సమంజసం కాదంటున్నారు. శ్రీశైలం ఎమ్మేల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. కొంతమంది నాయకులు పై వారిపైన ఒత్తిడి తీసుకువచ్చి శ్రీశైలం కోసం ప్రయత్నం చేస్తున్నారని.. కానీ అది అసాధ్యమన్నారు. శ్రీశైలం రాయలసీమలో భాగమని తేల్చేశారు.

Also Read : ఏపీ బార్ పాలసీ ఫెయిల్.. ఆసక్తి చూపని వ్యాపారులు.. కారణం అదేనా..?

ఇక ఇదే విషయంపై ఇటు మార్కాపురం, అటు నంద్యాల వాసుల మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. మార్కాపురం జిల్లాలో శ్రీశైలం కలపాలంటూ కొంతమంది సంతకాలు సేకరిస్తున్నారు. దీనిపై నంద్యాల జిల్లా వాసులు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. అలాంచి ఆలోచన మానుకోండి.. లేదంటూ యుద్ధమే.. అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. శ్రీశైలం ఎప్పటికీ రాయలసీమలో భాగమని.. నంద్యాల జిల్లా నుంచి శ్రీశైలం వేరు చేయలేరంటున్నారు. శ్రీశైల క్షేత్రం కాపాడుకుంటామంటున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్