చేసేది ప్రభుత్వ ఉద్యోగం. కానీ అదే ప్రభుత్వంపై విమర్శలు. రాజకీయాలకు అతీతంగా రాగ ద్వేషాలను దరి చేరకుండా విధులు సక్రమంగా నిర్వహిస్తానంటూ ఉద్యోగంలో చేరిన రోజున చేసిన ప్రతిన పూర్తిగా మర్చిపోయారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. గత ప్రభుత్వానికి అనుకూలంగా జుగుప్సాకరమైన పోస్టులు పెడుతున్నారు. చివరికి ప్రభుత్వ పెద్దల మార్ఫింగ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదేమని అడిగితే.. నాలుగేళ్లు ఆగితే.. మా పార్టీ వస్తుంది.. అంటూ రెచ్చిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ తీరుపై ఇప్పుడు జిల్లా పోలీసులు చాలా సీరియస్‌గా ఉన్నారు.
Also Read : వైసీపీలో ఫుల్ స్క్రాప్.. జగన్‌కు సినిమా..!
తమిళనాడులో మాత్రమే రాజకీయ పార్టీలకు ప్రభుత్వ ఉద్యోగులు బహిరంగంగానే మద్దుతు తెలిపే వారు. పార్టీ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనేవారు. అయితే జయలలిత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా ఎవరైనా పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఉద్యోగులు కాస్త వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఇలా పార్టీలకు ప్రభుత్వ ఉద్యోగులు మద్దతు తెలిపే విధానం తెలుగు రాష్ట్రాలకు కూడా పాకింది. ప్రభుత్వం మారిన ప్రతిసారి.. ఆ సర్కార్‌కు అనుకూలంగా వ్యవహరించారంటూ కొందరు అధికారులపై బదిలీ వేటు కూడా పడుతోంది. ఇలా కుర్చీలాట సర్వసాధారణం. దీంతో ఉద్యోగులు బహిరంగంగా రాజకీయ పార్టీల నేతలకు మద్దతు తెలిపేందుకు కాస్త వెనుకడుగు వేస్తున్నారు. ఇక తమకు కావాల్సిన చోటు పోస్టింగ్ కోసం కొందరు అధికారులు, ఉద్యోగులు, పోలీసులు అయితే.. పార్టీల నేతలకు భజన కూడా చేస్తారు. అలాంటి వారిలో ప్రధానంగా ఉద్యోగ సంఘాల నేతలు ముందు వరుసలో ఉంటారు. అయితే అధికారం మారిన తర్వాత అధికార పార్టీ నేతకు జై కొడతారు. కానీ బాధ్యతాయుతమైన హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న భైరి చంద్రశేఖర్ అనే ఉద్యోగి.. బహిరంగంగానే అధికార పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. అలాగే వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు కొమ్ము కాస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నప్పటికీ అధికారులు సైలెంట్‌గా ఉన్నారు.
Also Read : అసెంబ్లీలో పార్టీ పరువు తీసిన జగన్
వ్యక్తులు, పార్టీలతో సంబంధం లేకుండా వ్యవహరించాల్సిన పోలీసులే పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తే ఏ ప్రభుత్వం మాత్రం ఎందుకు చేష్టలుడిగి చూస్తుంది?!.. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం సైలెంట్‌గా ఉందనేది వాస్తవం. శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న భైరి చంద్రశేఖర్ వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని తొలి నుంచి విమర్శిస్తూనే ఉన్నాడు. చివరికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ మార్ఫింగ్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేసేంత బరితెగించాడు. అయితే ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు.. స్వయంగా మంత్రి నారా లోకేష్‌కు ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు. అలాగే జిల్లా సీనియర్ నేతల ద్వారా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు కూడా నేరుగా ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న లోకేష్..డీజీపీకి ఫార్వర్డ్ చేయడంతో ఆయన ఏసీబీ డీజీకి వీటిని పంపించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వ్యవహారాన్ని ముందుగానే పసిగట్టిన చంద్రశేఖర్.. తన అకౌంట్‌ను సైలెంట్‌గా డిలీట్ చేశాడు. అయితే ఐపీ అడ్రస్ ఆధారంగా ఇతని మీద కేసు నమోదు చేయాలంటూ పోలీస్ శాఖను నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : బీజేపీలో వేరు కుంపట్లు.. ఎవరి గ్రూప్ వారిదే..!
విజయవాడ సిటీ, రూరల్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన చంద్రశేఖర్.. 2021లో డిప్యూటేషన్‌పై శ్రీకాకుళం వచ్చాడు. నాటి నుంచి వైసీపీకి అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో ఉన్న ఫొటోను లోకేష్‌కు ట్యాగ్ చేశాడు. పవన్‌కల్యాణ్ దత్తపుత్రుడు, లోకేష్ ఉత్తపుత్రుడు అంటూ కానిస్టేబుల్ భైరి చంద్రశేఖర్ పెట్టడం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది కూడా. వాస్తవానికి చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలంటూ గతంలోనే ఏసీబీ డీజీకి పలువురు ఫిర్యాదు చేశారు. ఓ మహిళా వీఆర్వోపై అవినీతి ఆరోపణలు రావడంతో.. విచారణ పేరుతో ఆమె పట్ల చంద్రశేఖర్ అనుచితంగా ప్రవర్తించాడంటూ ఆమె భర్త ఫిర్యాదు చేశారు. అయితే గత ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా వ్యవహరించడంతో.. చంద్రశేఖర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లాలో కొన్ని ప్రభుత్వ శాఖల నుంచి అక్రమ వసూళ్లకు కూడా పాల్పడినట్లు ఫిర్యాదులున్నాయి. ఇన్ని ఆరోపణలున్నప్పటికీ.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అకౌంట్ డిలీట్ చేసినా.. సైబర్ క్రైమ్ ద్వారా చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.