Tuesday, October 28, 2025 06:58 AM
Tuesday, October 28, 2025 06:58 AM
roots

టూరిస్ట్ లకు శ్రీలంక గుడ్ న్యూస్.. వీసా ఫ్రీ..!

గత 5 ఏళ్ళుగా శ్రీలంక ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దేశంలో ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వంపై తిరుగుబాటు కూడా చేసారు అక్కడి ప్రజలు. ఇప్పుడిప్పుడే ఆ దేశం ఆర్ధిక సంక్షోభం నుంచి మెల్లగా బయటకు వస్తోంది. ఈ తరుణంలో తమ దేశానికి ప్రధాన ఆదాయ వనరు అయిన పర్యాటక రంగంపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. పర్యాటక రంగం ఆ దేశాన్ని ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడేస్తుంది. ముఖ్యంగా బీచ్ కల్చర్ ఈ దేశంలో ఎక్కువ.

Also Read : వీసా లేకుండా భారతీయులు ఎన్ని దేశాలకు వెళ్ళవచ్చంటే..?

తాజాగా ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక ఇప్పుడు తన ఉచిత పర్యాటక వీసా విధానాన్ని 40 దేశాలకు విస్తరించిందని విదేశాంగ మంత్రి విజిత హెరాత్ శుక్రవారం తెలిపారు. అర్హత కలిగిన ఏడు దేశాల ప్రస్తుత జాబితాలో చేర్చారు. గత వారం క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఈ అడుగు వేసింది శ్రీలంక. వీసా రుసుము మినహాయింపు కారణంగా ప్రభుత్వం వార్షిక ఆదాయ నష్టం 66 మిలియన్ డాలర్లుగా భావిస్తున్నారు. కాని పర్యాటకులు రాకపోతే ఇంతకంటే ఎక్కువ నష్టం ఉంటుందని భావిస్తోంది.

Also Read : ఆ విషయంలో వైసీపీ ఫుల్ కంట్రోల్..!

పర్యాటక రంగాన్ని మరింత అందుబాటులోకి తీసుకు రావాలని తాము భావిస్తున్నట్టు తెలిపారు. మార్చి 2023 నుండి చైనా, భారత్, ఇండోనేషియా, రష్యా, థాయిలాండ్, మలేషియా మరియు జపాన్‌లతో సహా 7 దేశాల పౌరులకు ఉచిత వీసా విధానం అమలులో ఉంది. ఇప్పుడు యూకే, ఆస్ట్రేలియా, అమెరికా సహా పలు దేశాలకు అందుబాటులోకి తెస్తోంది. పాకిస్తాన్ కు కూడా ఉచిత టూరిస్ట్ వీసా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక పలు యూరప్ దేశాలకు కూడా ఉచిత టూరిస్ట్ వీసా అందిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్