ఆంధ్రప్రదేశ్ లో అక్రమ రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు సర్కార్ సీరియస్ గా ఉండటంతో పోలీసు వర్గాలు ఇప్పుడు విచారణను వేగవంతం చేసాయి. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. కాకినాడ వేదికగా జరుగుతున్న ఈ అక్రమ దందా… ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనతో బయట పడింది. ఇక ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ స్పీడ్ పెంచింది. రేషన్ బియ్యం అక్రమ తరలింపు పై నమోదు అయిన కేసుల వివరాలు ఇవ్వాలని పోలీసులును సిట్ కోరింది.
Also Read : ఆయన సీఎం పదవి ఐదేళ్లూ సేఫేనా…?
పీ డీ ఎస్ తరలింపు పై కోరింగ, కరప, పోర్ట్, సర్పవరం, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లలో జూన్, జులై నెలలో 13 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు అయ్యాయి. రా రైస్, సెమి బాయిల్డ్ రైస్ అనుమతులు తో పీ డీ ఎస్ బియ్యం తరలిస్తున్న వారి పై కూడా విచారణ జరగనుంది. పేదలు బియ్యాన్ని ఇతర దేశాలకి తరలించినపుడు డాక్యుమెంట్ల లలో ఏ విధంగా చూపించారని సిట్ ఆరా తీస్తోంది. చైన్ సిస్టం ఎక్కడ ఉంది, ఎవరు నడిపిస్తున్నారనే దాని పై కూడ ఫోకస్ చేసారు. అధికారులు ఎవరైనా సహకరిస్తున్నారా అనే దానిపై ఫోకస్ పెట్టారు.
Also Read : అల్లు అర్జున్ కు వైసీపీ బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసింది
ఎక్సపర్టర్స్ సపోర్ట్ ఏ విధం గా ఉంటుంది, అసలు ఆర్డర్ ఇచ్చేది, డెలీవరీ తీసుకునేది ఎవరనే విషయాలు పై డేటా సేకరిస్తున్నారు. సివిల్ సప్లై అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, రేషన్ షాపులకు సరఫరా చేస్తున్న రైస్ కు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించనున్నారు. మొదట సమాచారం తీసుకుని క్షేత్రస్థాయి పర్యటనలు చేయనుంది ఇన్వెస్టిగేషన్ టీం. కాకినాడ ఎస్పీ ఎందుకు సెలవులో ఉన్నాడు అనే దానిపై సిట్ దృష్టి సారించింది. అలాగే స్థానిక పోలీసు అధికారుల పాత్రపై అధికారులకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు కూడా కొంత సమాచారాన్ని సిట్ కు ఇచ్చినట్టు సమాచారం.