Saturday, October 25, 2025 08:33 PM
Saturday, October 25, 2025 08:33 PM
roots

అల్టిమేట్ టెస్ట్.. సౌత్ ఆఫ్రికా కష్టమేనా..?

ఎంతో ఆసక్తిని రేపుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో విజయ లక్ష్మి ఎవరిని వరిస్తుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ లో ఇప్పటి వరకు ఒకసారి న్యూజిలాండ్, ఒకసారి ఆస్ట్రేలియా విజేతలుగా నిలవగా.. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనే దానిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. రెండు జట్లు బలమైనవే కావడంతో ఆసక్తి మరింత పెరిగింది. రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ఆధిపత్యం మారుతూ వస్తోంది.

Also Read : వరుస వివాదాల్లో రాము.. ఇప్పుడు అవసరమా..?

ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 212 పరుగులకు ఆల్ అవుట్ కాగా.. తర్వాత బ్యాటింగ్ కు దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు 138 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు.. ప్రస్తుతం 144 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. 73 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టును ఆ జట్టు కీపర్ అలెక్స్ క్యారీ.. స్టార్ బౌలర్ మిచెల్ స్తార్క్ ఆదుకున్నారు. 8 వికెట్ కు ఇద్దరూ 61 పరుగులు జోడించారు. లేదంటే ఆస్ట్రేలియా వంద పరుగుల లోపే ఆల్ అవుట్ అయ్యేది.

Also Read : ఆ అహంకారమే.. ఈ పరిస్థితికి కారణం..!

లబుషేన్, కవాజా, ట్రావిస్ హెడ్, స్మిత్, కమ్మిన్స్, గ్రీన్ ఇలా అందరూ తక్కువ పరుగులకే వికెట్ సమర్పించుకున్నారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లు క్రమంగా తప్పకుండా వికెట్లు తీయడంతో ఏ దశలో కూడా కోలుకోలేదు ఆస్ట్రేలియా జట్టు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న నేపధ్యంలో.. నాలుగవ ఇన్నింగ్స్ లో లక్ష్య చేధన అంత సులువు కాదనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. స్పిన్ కంటే ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండటం, ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ అటాక్ బలంగా ఉండటంతో సౌత్ ఆఫ్రికా ఎలా నిలబడుతుందో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్