Tuesday, October 28, 2025 07:31 AM
Tuesday, October 28, 2025 07:31 AM
roots

27 ఏళ్ళ తర్వాత.. చరిత్ర సృష్టించిన సఫారి జట్టు

వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా దుమ్ము రేపింది. తొలి ఇన్నింగ్స్ లో తడబడిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో అంచనాలకు మించి రాణించి వీరోచిత పోరాటం చేసి.. విశ్వ విజేతగా నిలిచింది. ఆ జట్టు ఓపెనర్ ఎయిడేన్ మార్కరం, కెప్టెన్ టెంబా బవుమా అద్భుతమైన బ్యాటింగ్ తో విజయ తీరాలకు చేరుకుంది. 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఆ జట్టును.. ముల్దర్ తో కలిసి మార్కరం ముందుకు నడిపించాడు. ఇక కీలక సమయంలో ముల్దర్ అవుట్ కాగా ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ బావుమా చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసాడు.

Also Read : కోహ్లీ, రోహిత్ స్థానాలను భర్తీ చేసేది ఆ ఇద్దరే..!

డిఫెన్స్ ఆడుతూనే పరుగులు చేస్తూ స్కోర్ బోర్డ్ ను ముందుకు నడిపించారు. ఇద్దరూ భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో సఫారి జట్టు.. మూడవ రోజే విజేతగా తేలిపోయింది. ఇక నాలుగవ రోజు 69 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆదిలోనే బావుమా వికెట్ కోల్పోయింది సఫారి జట్టు. ఆ తర్వాత వచ్చిన స్టబ్స్ కూడా తక్కువ పరుగులకే అవుట్ కాగా.. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన బెండింగం.. జాగ్రత్తగా ఆడాడు. అయితే ఆరు పరుగులు కావాల్సి ఉండగా.. భారీ షాట్ కు ప్రయత్నించి.. మార్కరం అవుట్ అయ్యాడు.

Also Read : ఇజ్రాయిల్ కు చుక్కలు చూపిస్తున్న ఇరాన్.. యుద్ధం మొదలు

అప్పటికే సఫారి జట్టు విజయం ఖరారు అయిపొయింది. చివరలో ఫోర్ కొట్టి ఆ జట్టు కీపర్ మ్యాచ్ ను ముగించాడు. దీనితో దక్షిణాఫ్రికా 27 సంవత్సరాల తర్వాత తొలిసారి ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇక సఫారి బౌలర్ లు రెండు ఇన్నింగ్స్ లలో దుమ్ము రేపారు. ఆస్ట్రేలియా ఏ దశలో కూడా స్వేచ్చగా పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. మిచెల్ స్టార్క్, అలెక్స్ క్యారీ ఒంటరి పోరాటం చేయడంతో ఆస్ట్రేలియా నిలబడింది. అప్పటికే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా మారడం సఫారి జట్టుకు కలిసి వచ్చింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్