సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ ల విషయంలో సోషల్ మీడియాలో కాస్త నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మ్యాచ్ ఎలా జరిగినా సరే అనుమానాలకు దారి తీయడంతో దాదాపుగా అన్ని మ్యాచ్ లపై అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఫిక్సింగ్ అనేది ఎక్కువగా ఐపీఎల్ లో వినపడుతూ ఉంటుంది. గతంలో పలు జట్లపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడమే కాకుండా రెండేళ్ల పాటు నిషేధానికి కూడా గురైన సందర్భాలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండేళ్ల పాటు నిషేధానికి గురయ్యాయి.
Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే
ఇక ముంబై ఇండియన్స్ జట్టు కప్పు గెలిచిన ప్రతిసారి లేదంటే మ్యాచ్ గెలిచిన ప్రతిసారి ఫిక్సింగ్ అనేది సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వచ్చే కామెంట్. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ పై కూడా సోషల్ మీడియాలో ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక సమయంలో ఢిల్లీ ఏకపక్షంగా విజయం సాధించే అవకాశం ఉందని అందరూ భావించారు. కరుణ్ నాయర్ బ్యాటింగ్ దాటికి ముంబై బౌలర్లు తేలిపోయారు. భారీ షాట్లతో విరుచుకుపడిన కరుణ్ ఢిల్లీని విజయ తీరాలకు చేరుస్తాడని భావించారు.
Also Read : రాహుల్ కోపం ఎవరిపై..?
అయితే కీలక సమయంలో అతని వికెట్ పడటం ఆ తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోవడంతో ముంబై జట్టు విజయం సాధించింది. ఇక ఆఖరిలో హ్యాట్రిక్ రన్ అవుట్లు కూడా ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాయి. అయితే కొంతమంది అవుట్ అయిన తీరుపై సోషల్ మీడియాలో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తొలి బంతికి ఢిల్లీ ఓపెనర్ ఫేసర్ వికెట్ కోల్పోవడం.. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ వికెట్.. ఇక ఢిల్లీ కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ వికెట్ అన్నీ కూడా అనుమానాలకు దారితీసాయి. దానితో పాటు కుల్దీప్ యాదవ్ రన్ అవుట్ అలాగే ఆశుతోష్ శర్మ రన్ అవుట్ కూడా అభిమానులకు అనుమానాలు కలిగించాయి. అప్పటివరకు నిలకడగా ఆడిన ఢిల్లీ జట్టు ఎందుకు అలా క్రమంగా వికెట్లు కోల్పోయింది అనేదే ప్రధాన ప్రశ్న.