రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు వస్తోందంటే.. ఖచ్చితంగా ఫ్యాన్స్ ఏదోక న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ప్రభాస్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అనేది ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. రాజాసాబ్ టీజర్ ను లేదా స్పిరిట్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసే అవకాశం ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మాత్రం క్లారిటీ లేకపోయినా రెబల్ ఫ్యాన్స్ ను నిరాశపరిచే అవకాశం అయితే లేదు అనేది క్లారిటీ వస్తోంది. ఖచ్చితంగా వాళ్ళకు బూస్ట్ ఇచ్చే న్యూస్ ఉండవచ్చని అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు.
ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు ప్రభాస్ నిర్మాతలు కూడా అదే ఫాలో అవుతున్నట్టు టాక్. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఏకంగా ఆరు సినిమాలను రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మిస్టర్ పర్ఫెక్ట్ ను ఈ నెల 22న హైదరాబాద్ లో రీ రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి టికెట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ సినిమాకు లేడీ ఆడియన్స్ లో ఫ్యాన్స్ ఎక్కువ. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా టీవీల్లో మాత్రం సూపర్ హిట్ అయింది.
Also read : టాలీవుడ్‌లో టికెట్ల రేట్లపై రచ్చ…!
ఇక రాజమౌళి… ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. అలాగే కొరటాల శివ తో ప్రభాస్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ… మిర్చీ కూడా రీ రిలీజ్ అవుతుండటం ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగ వాతావరణమే. అలాగే ఈశ్వర్, రెబల్ సినిమాలను కూడా తిరిగి థియేటర్లలో తీసుకురానున్నారు. ఇక ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేసిన సలార్ సినిమాను ఈ నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్ లో రీ రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి టికెట్ లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు కొత్త సినిమాల పై కూడా ఏదైనా అప్డేట్ ఏమైనా ఉంటుందేమో చూడాలి.