ఏపీ లిక్కర్ స్కాం వ్యవహారంలో దర్యాప్తు బృందాలు దూకుడు పెంచాయి. ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రముఖులను విచారించేందుకు రంగం సిద్దం చేసారు. ఈ కేసులో అన్నీ తానై వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఇక తాజాగా వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేసారు. రేపు విచారణకు రావాలని నోటీసులలో పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి ఈ కేసులో విచారణకు హాజరు అయ్యారు. ఆయన శుక్రవారం విచారణకు రావాల్సి ఉండగా ఒక రోజు ముందుగానే హాజరు అయ్యారు.
Also Read : ఏపీ ఫైబర్ నెట్ లో కీలక పరిణామం
రేపు రావాలని రాజ్ కసిరెడ్డి తండ్రికి నోటీసులు జారీ చేసారు. ఎల్లుండి హాజరు కావాలని రాజ్ కసిరెడ్డికి మరో నోటీస్ ఇచ్చారు. రాజ్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని మూడుసార్లు డుమ్మా కొట్టారు. మద్యం కుంభకోణం దర్యాప్తులో ‘సిట్ స్పీడు పెంచడంతో ప్రముఖుల్లో భయం మొదలయింది. కీలక సూత్రధారులు, పాత్రధారుల వరుస విచారణకు రంగం సిద్ధం చేసారు. జగన్ హయాంలో కమీషన్లు సమర్పించుకున్న మద్యం ఉత్పత్తిదారులు, వ్యాపారులను కూడా విచారణకు పిలిచారు. వీరిని మిథున్ రెడ్డితో కలిపి ప్రశ్నించి… కీలక వివరాలు రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.
Also Read : మళ్ళీ సాయి రెడ్డేనా..? రాజ్యసభ ఉప ఎన్నిక సందడి షురూ
మిథున్ రెడ్డి,విచారణకు హాజరవుతారా, లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించినప్పటికీ… విచారణకు సహకరించాలని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. మరోవైపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, పదేపదే విచారణకు డుమ్మా కొడుతున్న మద్యం స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అతను విదేశాలకు పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. ఒక వైపు ఆయనకోసం విస్తృతంగా గాలిస్తూనే… తాజాగా ఈ నెల 18న విచార ణకు రావాలంటూ నోటీసు జారీ చేసారు. ఇప్పటికే మూడుసార్లు సిట్ విచారణకు డుమ్మా కొట్టిన రాజ్ కసిరెడ్డి ఇళ్లు, కార్యాలయం, బందువుల ఇళ్లు, భార్య పేరుతో పెట్టుబడులు పెట్టిన ఆసుపత్రిలో రెండు రోజులపాటు హైదరాబాద్లో సిట్ సిబ్బంది సోదాలు చేసారు.




