బోరింగ్ టెస్ట్ క్రికెట్ అన్న వాళ్లకు జీవిత కాలం గుర్తుండే సమాధానం.. ఇండియన్ పేస్ బౌలింగ్ వీక్ అనే వాళ్లకు మళ్ళీ ఆ మాట అనకుండా రివేంజ్.. సీరీస్ ఓటమి ఖాయం అనుకున్న వాళ్లను కాలర్ ఎగరేసేలా చేసిన సందర్భం.. వంద థ్రిల్లర్ సినిమాలు, కోటి టి20 మ్యాచ్ లను మించి పక్కా టెస్ట్ మ్యాచ్.. 5 టెస్ట్ ల సీరీస్ ఈ రేంజ్ లో ముగుస్తుందని.. ఎవరూ ఊహించలేదు. మొదటి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోర్ లు నమోదు అయినా.. రెండో ఇన్నింగ్స్ లో రెండు జట్లూ చేసిన పోరాటం ఓ చరిత్రను సృష్టించింది.
Also Read : మీరు ఇండియన్ అయితే.. రాహుల్ కు సుప్రీం కోర్ట్ షాక్
టెస్ట్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో చెప్పిన ఓవల్ టెస్ట్ లో భారత్ చిరస్మరణీయ విజయం సాధించింది. పేస్ బౌలర్లు సాధించిన ఈ విజయం.. టెస్ట్ క్రికెట్ కు మళ్ళీ ప్రాణం పోసింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు.. ఆదిలో కాస్త దూకుడుగా ఆడినా.. ఆ తర్వాత మాత్రం తడబడింది. కాని.. జో రూట్, బ్రూక్ సెంచరీలతో ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో గెలవడం ఖాయం అని భావించారు. అనూహ్యంగా ఇంగ్లాండ్.. భారత బౌలింగ్ దెబ్బకు కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయింది.
Also Read : భారత్ మోసం చేస్తుంది.. అమెరికా అధికారి సంచలన కామెంట్స్
301 పరుగుల వద్ద సెంచరీ చేసి ఊపు మీదున్న బ్రూక్ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ ఆ తర్వాత.. వేగంగా పతనం అయింది. మరో 30 పరుగులకు బెతల్, ఆ తర్వాత కాసేపటికే.. రూట్ వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 4వ రోజు వికెట్ పడకుండా ఇంగ్లాండ్ జాగ్రత్త పడింది. 5 వ రోజు భారత్ కు 4 వికెట్లు కావాల్సి ఉండగా ఇంగ్లాండ్ కు 35 పరుగులు కావాల్సి ఉంది. చివరకు.. సిరాజ్ నాలుగు వికెట్లలో మూడు తీయడంతో భారత్.. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆఖర్లో అటికిన్సన్ ఇంగ్లాండ్ ను గెలిపించేందుకు దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా.. సిరాజ్ దెబ్బకు చేతులెత్తేసాడు. అద్భుతమైన ఇన్ స్వింగ్ యార్కర్ తో బౌల్డ్ చేసి చిరస్మరణీయ విజయాన్ని భారత్ కు అందించాడు. ఈ మ్యాచ్ లో మొత్తం సిరాజ్ 9 వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ 8 వికెట్లు తీసాడు.




