Monday, October 27, 2025 07:28 PM
Monday, October 27, 2025 07:28 PM
roots

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.. అసలు ఏమైంది..?

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే సిరీస్ కు ముందు భారత్ కు ఎదురు దెబ్బ తగిలే సంకేతాలు కనపడుతున్నాయి. ఆస్ట్రేలియాతో చివరి వన్డేలో భాగంగా టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. హర్షిత్ రానా బౌలింగ్ లో అద్భుత క్యాచ్ పట్టిన అయ్యర్, ఆ తర్వాత మైదానాన్ని వీడాడు. బ్యాటింగ్ చేసే అవసరం రాకపోవడంతో అయ్యర్ బరిలోకి దిగలేదు. ఇక అక్కడ నుంచి అతనినీ నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లిన సిబ్బంది.. ఓ ప్రముఖ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో అయ్యర్ కు తీవ్ర గాయమైనట్లు వైద్యులు గుర్తించారు.

Also Read : వరల్డ్ కప్‌కు మేం రెడీ.. రోకో క్లారిటీ..!

ఎడమ పక్కటెముకల్లో మూడు ఎముకలు ఫ్రాక్చర్ అయినట్లుగా స్కానింగ్ లో బయటపడింది. అలాగే అంతర్గత రక్తస్రావం కూడా జరుగుతున్నట్లు గుర్తించారు. దీనితో అతన్ని వెంటనే ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం సిడ్నీలోనే ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై 2 నుంచి 7 రోజుల్లో ఆసుపత్రి వైద్యులు ప్రకటన చేసే అవకాశం ఉందని బీసీసీఐ తెలిపింది. ఇటు భారత్ నుంచి కూడా వైద్యులను ఆస్ట్రేలియా పంపినట్లు తెలిపింది. బోర్డు వైద్యుల సమక్షంలో అయ్యర్ కు అంతర్జాతీయ వైద్య సదుపాయాలు అందిస్తున్నామని పేర్కొంది.

Also Read : 2027 వరకూ గిల్ కష్టమేనా..? గంభీర్ గ్యాంగ్ కు కష్టాలు..?

ఇక అయ్యర్ కు సంబంధించి వార్త బయటకు రాగానే.. వచ్చే నెలలో సౌత్ ఆఫ్రికా తో జరిగే వన్డే సిరీస్ లోపు అయ్యర్ కోలుకో లేకపోతే.. అతని స్థానంలో ఎవరు ఆడతారు అనేది ప్రధాన ప్రశ్న. అయితే ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, సంజు శాంసన్, నారాయణ్ జగదీషన్ పేర్లు వినపడుతున్నాయి. ఇంగ్లాండ్ లో జరిగిన టెస్ట్ సిరీస్ లో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటినుంచి కోలుకుంటున్న పంత్ ఇటీవల రంజీలకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. దీనితో అతనిని దాదాపుగా వన్డే సిరీస్ కు ఎంపిక చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ వచ్చిన తర్వాత సెలెక్టర్లు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండవచ్చు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

ఆర్టీసీ బస్సు తప్పింది.....

కర్నూలు రోడ్డు ప్రమాదం ఘటన విషయంలో...

పోల్స్