Monday, October 27, 2025 10:34 PM
Monday, October 27, 2025 10:34 PM
roots

తొలి ఎలక్ట్రిక్ విమానం.. టికెట్ రేట్ తెలిస్తే షాక్ అవ్వడమే..!

ప్రపంచ వ్యాప్తంగా విమానయాన రంగం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. విమాన ప్రయాణం కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో చాలా మంది విమానాల్లో ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపించరు. జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో విమానయాన రంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. భారత్ లో విమాన ప్రయాణ టికెట్ ధరలను తగ్గించినా ఆ తర్వాత మళ్ళీ పెంచారు. ఇప్పుడు అమెరికాలో తక్కువ ధరకే విమాన ప్రయాణం అందించే దిశగా కీలక అడుగు పడింది.

Also Read : ఇరాన్ కు ట్రైనింగ్ ఇచ్చిన అమెరికానే ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతోంది..?

1976లో సూపర్‌సోనిక్ కాంకార్డ్ తన తొలి వాణిజ్య విమానాన్ని నడపడం అప్పట్లో ఎంత సంచలనంగా మారిందో.. ఇప్పుడు దాదాపుగా అలాంటిదే జరిగింది. పౌర విమానయానం మరో చరిత్ర సృష్టించింది. బీటా టెక్నాలజీస్‌కు చెందిన అలియా CX300 ఎలక్ట్రిక్ విమానం న్యూయార్క్‌ లోని JFK విమానాశ్రయంలో నలుగురు ప్రయాణికులతో ల్యాండ్ అయింది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ విమానం. ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగానే ఇది కూడా పని చేయనుంది. లాంగ్ ఐలాండ్‌లోని ఈస్ట్ హాంప్టన్ నుండి న్యూయార్క్‌ కు 130 కి.మీ విమాన ప్రయాణం కేవలం 35 నిమిషాల్లో పూర్తయింది.

Also Read : విమర్శల దెబ్బకు వెనక్కు తగ్గిన గంభీర్.. టీంలో భారీ మార్పులు

ఇందుకోసం కేవలం 8 డాలర్లు అంటే 700 రూపాయల కంటే తక్కువ చార్జ్ చేసారు. రోడ్డు మార్గంలో, 130 కి.మీ ప్రయాణం సాధారణంగా కారులో 2 గంటలకు పైగా పడుతుంది, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ప్రయాణం చేయడం మరింత తలనొప్పి. దీనికి 30 నుంచి 40 డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. దానితో పోలిస్తే ఈ ప్రయాణం ఖర్చు చాలా తక్కువ అయింది. పూర్తిగా ఛార్జ్ చేస్తే 460 కి.మీ (250 నాటికల్ మైళ్ళు) దూరం ప్రయాణించగలిగే సామర్ధ్యం ఈ విమానం సొంతం. ఇది గరిష్టంగా గంటకు 222 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్