Tuesday, October 28, 2025 06:58 AM
Tuesday, October 28, 2025 06:58 AM
roots

క్రికెట్ ఫ్యాన్స్ కు మరో షాకింగ్ న్యూస్.. మరో ప్లేయర్ రిటైర్..?

భారత క్రికెట్ లో రిటైర్మెంట్లు కొనసాగే సంకేతాలు కనబడుతున్నాయి. ఇటీవల టెస్ట్ క్రికెట్ జట్టు నుంచి రోహిత్ శర్మతో పాటుగా విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్ లో వీళ్ళిద్దరికీ ఉన్న స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఆటగాళ్లు భారత జట్టు నుంచి తప్పుకోవడంతో టెస్ట్ క్రికెట్ కు అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందా అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చలు జరుగుతున్నాయి.

Also Read : టీడీపీ రూట్ మ్యాప్.. మహానాడులో అన్నీ సంచలనాలే

భారత జట్టులో వాళ్ళు ఇద్దరినీ మించి స్టార్ ఆటగాళ్లు దాదాపుగా లేరు. బూమ్రా, జడేజా, రాహుల్ కు ఇమేజ్ ఉన్నా సరే వాళ్లతో సరితూగే ఇమేజ్ కాదు. ఈ సమయంలో అభిమానులకు మరో షాక్ తగిలే అవకాశం కనబడుతోంది. టెస్ట్ క్రికెట్ నుంచి రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత జడేజా టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పే సూచనలు ఉన్నాయి. జడేజాకు మంచి మార్కెట్ ఉన్నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని బోర్డు భావిస్తోంది.

Also Read : వైసీపీని షేక్ చేస్తున్న లోకేష్ ఢిల్లీ టూర్.. సడన్ టూర్ అందుకేనా..?

దీనితో బోర్డు పెద్దలు జడేజాతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాబోయే సీజన్ లో కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించే దిశగా బోర్డు అడుగులు వేస్తోంది. దీనితో జడేజాను కూడా పక్కన పెట్టాలని బోర్డు పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే గౌతమ్ గంభీర్ అతనితో చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇంగ్లాండ్ పర్యటనకు ముందే అతను తప్పుకుంటాడా లేదంటే తర్వాత టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాడా అనేది చూడాలి. జడేజా కూడా రిటైర్ అయితే.. టెస్ట్ క్రికెట్ మార్కెట్ మళ్లీ భారత్ లో పెరగడానికి మరింత సమయం తీసుకునే అవకాశం ఉండవచ్చు. మరి దీనికి బోర్డు నష్ట నివారణ చర్యలు ఏ విధంగా చేపడుతుందో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్