టీవీ డిబేట్‌లో మాట్లాడితే డబ్బులిస్తారా.. అసలు రోజూ ఇలా డిబేట్‌కు వచ్చే వాళ్లకు ఛానల్ వాళ్లు కానీ.. ఆయా పార్టీల నేతలు కానీ డబ్బులిస్తారా.. అసలు వాళ్లు ఎందుకు అన్నిసార్లు టీవీల్లో వస్తారు.. ఇవే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో ఉంటాయి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఛానల్ వాళ్లు ఎవరికీ డబ్బులు ఇవ్వరూ.. పైగా మమ్మల్ని ఎందుకు డిబేట్‌కు పిలవటం లేదంటూ అనలిస్టులు, పార్టీల నేతలే ఛానల్ వాళ్లను అడుగుతారు కూడా. ఎందుకంటే.. అలా డిబేట్‌లో కూర్చుంటేనే కదా.. వారికి పార్టీలో, ప్రజల్లో పేరు వస్తుంది. మరి అలాంటి వారికి డబ్బులు ఎందుకు ఇస్తారు.. ఎవరిస్తారు.. అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయితే ఈ చర్చ అంతా ఇప్పుడు ఎందుకూ అంటే.. అనలిస్టు ముసుగులో అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు అకౌంట్ చూసి పోలీసులు ఆశ్చర్యపోయారట.
సాక్షి ఛానల్‌లో నిర్వహించిన డిబేట్‌లో అనలిస్టు, సీనియర్ జర్నలిస్టు అని చెప్పుకునే కృష్ణంరాజు.. అమరావతి ప్రాంతాన్ని, ఏపీ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు. అయినా సరే.. తాను చేసిన వ్యాఖ్యలను కృష్ణంరాజు సమర్థించుకున్నారు. అయితే తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపైన, ఆ డిబేట్ కొనసాగించిన కొమ్మినేని శ్రీనివాసరావుపైన పోలీసులు కేసు నమోదు చేశారు. కొమ్మినేనికి సుప్రీం కోర్టు కండీషన్ బెయిల్ మంజూరు చేసింది. కృష్ణంరాజుకు మాత్రం కోర్టు రిమాండ్ విధించింది. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా కృష్ణంరాజును 3 రోజుల పాటు తుళ్లూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇక్కడే కృష్ణంరాజు అంటే ఏమిటో బయటి ప్రపంచానికి తెలిసింది.
వాస్తవానికి కృష్ణంరాజు అనలిస్టు ముసుగులో ఉన్న ఎర్నలిస్టు అనే విషయం బయటపడింది. కృష్ణంరాజు బ్యాంకు ఖాతాలను పరిశీలించిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారట. అసలు మీకు ఆదాయం ఎలా వస్తుందన ప్రశ్నించారట. ఏదైనా సంస్థలో పని చేస్తున్నారా అంటే లేదు.. పోనీ ఆయన నిర్వహిస్తున్న పత్రిక సర్క్యూలేషన్ ద్వారా డబ్బులు వస్తున్నాయా.. అంటే.. అసలు ఆ పత్రిక బయట ఎక్కడా కనిపించదు.. మరి ఇలాంటి వ్యక్తికి ఆదాయం ఎలా వస్తుంది.. అకౌంట్‌లో డబ్బులు అలా జమా ఎలా అవుతున్నాయని పోలీసులే షాక్ అయ్యారట. ఇదే విషయాన్ని కృష్ణంరాజును కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అసలు ఖాతాల్లో సొమ్ము జమ ఎలా అవుతుందని ప్రశ్నిస్తే.. నాకేం తెలియదు అన్నారట. అసలు మీకు ఆదాయం ఎలా వస్తుందనే ప్రశ్నకు విచిత్రంగా గుర్తు లేదు అనేశారంట.
అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ డబ్బులు తీసుకుని.. 3 మాటలు చెప్తారు.. తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. ఈ మాటలే ఇప్పుడు కృష్ణంరాజు అంటున్నారు. డబ్బులు తీసుకుని ఈ మూడు మాటలే చెబుతున్నట్లు తెలుస్తోంది. 40 ప్రశ్నలు వేసిన పోలీసులకు. 3 జవాబులు మాత్రమే వచ్చాయట. అవే తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా.. అని మాత్రమే చెబుతున్నారు. అసలు టీవీ డిబేట్‌లో పాల్గొనే కృష్ణంరాజు ఖాతాలోకి డబ్బులు జమ కావడమేమిటి.. ఎవరిస్తున్నారు… అనే విషయంపై ఇప్పుడు పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. డిబేట్‌లో వైసీపీకి అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు పార్టీ నేతలు కానీ.. సాక్షి నిర్వాహకులు ఏమైనా డబ్బులిస్తున్నారేమో అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.