రాజకీయ పార్టీల కార్యకర్తలపై మీడియా ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది అనే మాట వాస్తవం. తాము అభిమానించే నాయకులపై మీడియాలో ఏవైనా కథనాలు వస్తే వాటిని ఎక్కువగా మైండ్ కు తీసుకుంటూ ఉంటారు. విమర్శలు, పొగడ్తలు ఇలా చాలా అంశాల్లో మీడియా ప్రభావం ఉంటుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది అనే మాట వాస్తవం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్స్ తో పెద్ద చర్చే జరుగుతూ వస్తోంది.
Also Read : బాబు సింగపూర్ పర్యటనతో పోయిన పరువు తిరిగొస్తుందా?
జగన్ పర్యటనలలో భద్రత కల్పించడం లేదని విమర్శలు చేస్తున్నారు. వీటిని వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. తాజాగా 99 టీవీ ఛానల్ లో విశ్లేషణలు చేసే ఓ జర్నలిస్ట్ జగన్ భద్రతపై సంచలన కామెంట్స్ చేసాడు. జగన్ ను అంతం చేయడానికి అమెరికా నుంచి 200 మంది షార్ప్ షూటర్స్ దిగారు అని, వారు జగన్ పర్యటించే ప్రాంతాల్లో రెక్కి చేసాడు అని కామెంట్స్ చేసాడు. ఆ తర్వాతి నుంచి అతను కనపడలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు.
Also Read : రెండు తప్పులు సీరీస్ ను ముంచాయా..?
అసలు ఆ కామెంట్స్ చేయడానికి కారణం ఏంటీ అనే దానిపై పెద్ద చర్చే మొదలైంది. దీనిపై జనసేన నేత ఒకరు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. వెంటనే హైదరాబాద్ వెళ్ళిన పోలీసులు అతనికి 41 ఏ నోటీసులు ఇవ్వాలని భావించారు. కాని అతను ఛానల్ లో లేకపోవడంతో, సీఈఓ, ఇతర జర్నలిస్ట్ ల వాంగ్మూలం తీసుకోగా వారు, జులై 29వ తేదీన అతనిని విచారణకు పంపిస్తామని చెప్పడంతో పోలీసులు తిరిగి నల్లపాడు వెళ్ళారు. అతను విచారణకు వెళ్లకపోవడంతో ఛానల్ చీఫ్ ఎడిటర్ వెళ్లి వాంగ్మూలం ఇచ్చారు. అతనిని ఛానల్ నుంచి తొలగిస్తున్నామని కూడా ప్రకటించారు. ఇప్పటి వరకు అతను అందుబాటులోకి రాలేదు. దీనితో చట్టపరమైన చర్యలకు పోలీసు శాఖ సిద్దమైనట్టు సమాచారం.




