Friday, September 12, 2025 07:04 PM
Friday, September 12, 2025 07:04 PM
roots

వారసులు.. ఎవరు అసలు.. ఎవరు నకిలీ..?

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. నారా చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబాలు ఇప్పుడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిల్లో నారా చంద్రబాబు నాయుడుకు లోకేష్ ఒక్కడే కుమారుడు. కాబట్టి చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని నడిపించే లీడర్ ఎవరనే విషయంపై నేతలకు ఎలాంటి అనుమానాలు లేవు. కానీ వైఎస్, కల్వకుంట్ల ఫ్యామిలీలో మాత్రం ఇప్పుడు పొలిటికల్ వారసులు ఎవరైన చర్చ జోరుగా నడుస్తోంది.

Also Read : ఇదేం ప్రెస్ మీట్ అన్న..? షాక్ అవుతున్న జర్నలిస్ట్ లు

ఏపీలో రాజకీయాల్లో వైఎస్ కుటుంబం చాలా కీలక పాత్ర పోషిస్తోంది. 1979 నుంచి వైఎస్ ఫ్యామిలీ ఏపీ రాజకీయాల్లో కొనసాగుతోంది. పాదయాత్రతో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఏపీ వ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. ఇక 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ వంటి పథకాలతో ప్రజలకు మరింత దగ్గరయ్యారు వైఎస్ఆర్. ఆయన మరణానంతరం రాజకీయ వారసత్వంపై ఇప్పుడు కుమారుడు జగన్ మోహన్ రెడ్డి, కుమార్తె షర్మిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

వైఎస్ఆర్ పొలిటికల్ వారసునిగా రాజకీయాల్లోకి వచ్చారు వైఎస్ జగన్. వైఎస్ఆర్‌సీపీ పేరుతో పార్టీ కూడా స్థాపించి ఏపీకి సీఎంగా కూడా వ్యవహరించారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ అసలైన వారసుడు తన కుమారుడే అంటూ వైఎస్ రాజరెడ్డిని షర్మిల తెర పైకి తీసుకువచ్చారు. కర్నూలు జిల్లా పర్యటన సమయంలో షర్మిల వెంటే రాజారెడ్డి ఉన్నారు. దీంతో అంతా రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు అనే ప్రశ్నలు వేశారు. దీంతో సమయం వచ్చినప్పుడు.. అంటూ షర్మిల ముక్తసరిగా జవాబిచ్చారు.

అయితే రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై వైసీపీ నేతలు సోషల్ మీడియాలో టార్గెట్ షర్మిల అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో మరోసారి షర్మిల తనదైన శైలిలో వైసీపీ నేతలకు జవాబిచ్చారు. అసలు తన కుమారుడు రాజకీయాల్లోకి రాకముందే వైసీపీ నేతలకు ఎందుకు అంత భయం అని ప్రశ్నించారు. తన కుమారుడికి రాజారెడ్డి అనే పేరును వైఎస్ఆర్ స్వయంగా పెట్టారని.. కాబట్టి వైఎస్ నిజమైన రాజకీయ వారసుడు తన కుమారుడే అని వెల్లడించారు.

Also Read : ఒక్కటే రాజధాని.. సజ్జల సంచలన ప్రకటన

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం ఆ ఇద్దరు కూడా విదేశాల్లో ఉంటున్నారు. దీంతో జగన్ తర్వాత పార్టీని ఎవరు ముందుకు నడిపిస్తారనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. జగన్ తర్వాత రాజకీయాల్లో వైఎస్ ఫ్యామిలీ తరఫున ఎవరుంటారనే ప్రశ్న ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఈ ప్రశ్నకు షర్మిల జవాబు చెప్పినట్లు అయ్యింది. వైఎస్ఆర్ నిజమైన రాజకీయ వారసుడు వైఎస్ రాజారెడ్డి అని షర్మిల పదే పదే చెబుతున్నారు. ఈ మాట ఇప్పుడు వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

పోల్స్