Friday, September 12, 2025 05:28 PM
Friday, September 12, 2025 05:28 PM
roots

తండ్రికి ఉన్న దమ్ము లేదా..? అంత భయమెందుకు జగన్..?

వైసీపీ అధినేత జగన్ గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. సాధారణంగా జగన్ మీడియాతో మాట్లాడటం కంటే రికార్డు చేసిన వీడియోలను రిలీజ్ చేస్తూ ఉంటారు. గురువారం కూడా అలాగే రిలీజ్ చేశారు జగన్. ఎడిట్ చేసిన వీడియోగా ఆ ప్రెస్ మీట్ స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక జగన్ చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు కూడా వైరల్ చేయలేని విధంగా ఉన్నాయంటూ కొంతమంది సెటైర్లు వేస్తున్నారు.

Also Read : బ్రేకింగ్: సజ్జల భార్గవ్ అరెస్ట్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్

ఆ పార్టీ కార్యకర్తలు కూడా జగన్ ప్రసంగాలను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. లిక్కర్ కుంభకోణం విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై.. పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనకే ప్రమేయం లేదని జగన్ చెప్పుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత షర్మిల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. జగన్ చేసిన వ్యాఖ్యలను ఎండగట్టారు. నిజంగా జగన్ తప్పు చేయకపోతే.. గతంలో రాజశేఖర్ రెడ్డి మాదిరిగా.. ఉరితీయాలని.. ఇష్టం వచ్చిన దర్యాప్తు సంస్థతో విచారణ చేసుకోవచ్చని.. అవసరమైతే తనను కూడా విచారించుకోవచ్చని ఎందుకు చెప్పలేకపోయారని ఆమె నిలదీశారు.

Also Read : మాకేం పాపం తెలీదు.. లిక్కర్ పాపం వారిదే..?

ఈ వీడియోని టిడిపి వర్గాలతో పాటుగా జగన్ మోహన్ రెడ్డిని వ్యతిరేకించే పలువురు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేశారు. దీనితో వైసిపి ఒకరకంగా ఆత్మ రక్షణలో పడిపోయింది. గతంలో జగన్ పై ఆరోపణలు వచ్చిన సమయంలో అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడిన సందర్భాలు ఉన్నాయి. దర్యాప్తు సంస్థలు విచారణ చేసుకోవచ్చంటూ ఆయన సవాల్ చేసిన వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. అలాంటిది లిక్కర్ కుంభకోణంలో తన తప్పు లేకపోతే జగన్ ఎందుకు విచారణ డిమాండ్ చేయడం లేదనేది ప్రధాన ప్రశ్న.

Also Read : సల్మాన్ ను వెంటాడుతున్న లారెన్స్ గ్యాంగ్

దానికి తోడు తన వద్ద డబ్బులు లేవని.. పార్టీ నడపడానికి డబ్బులు ఇవ్వాలని జగన్ అడగటం కూడా షాక్ కు గురి చేసింది. 2014 నుంచి 2019 వరకు వైసిపి అధికారంలో లేకపోయినా ప్రశాంత్ కిషోర్ టీంకు వందల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి జగన్ నడిపించారు. ఇక 2019 నుంచి 2024 వరకు వైసిపి అధికారంలో ఉంది. తండ్రి అధికారంలో ఉన్న సమయంలోనే పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన జగన్ స్వయంగా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత పాల్పడకుండా ఎలా ఉంటారు అనేది చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి తోడు వైసీపీ ఎన్నికల కమిషన్ కి సమర్పించిన నివేదిక ప్రకారం పార్టీ వద్ద 3,000 కోట్లకి పైగా నిధులు ఉన్నట్లు పేర్కొంది. పార్టీ నిధుల నుంచి ఒక్క రూపాయి కార్యకర్తలకి సహాయం చేసినట్లు ఎక్కడ లేదు. మరి పార్టీ నడపడానికి డబ్బు లేదని చెప్పడంతో వైసీపీ కార్యకర్తలు, నాయకులే నవ్వుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్