Saturday, September 13, 2025 03:13 AM
Saturday, September 13, 2025 03:13 AM
roots

లిక్కర్ కేసులో సంచలనం.. 12 అట్టపెట్టెల్లో భారీగా డబ్బు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ పై దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పక్కా ఆధారాలతో విచారణ మొదలుపెట్టిన అధికారులు, అరెస్ట్ ల విషయంలో కూడా అంతే జాగ్రత్త తీసుకున్నారు. కీలక వ్యక్తులను ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ వస్తున్నారు సిట్ అధికారులు. ఇటీవల రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన అధికారులు త్వరలోనే మరో కీలక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Also Read : టీటీడీ ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతం..

ఇక ఈ లిక్కర్ కేసులో రూ.11 కోట్లను తాజాగా సీజ్ చేసారు అధికారులు. రెండు మూడు రోజుల నుంచి పక్కా సమాచారంతో హైదరాబాద్ లోని కీలక ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తూ వచ్చారు. కీలక వ్యక్తులను విచారించిన సమయంలో అందిన సమాచారం ఆధారంగా ఈ సోదాలు జరిగాయి. హైదరాబాద్ లోని భారతీ సిమెంట్స్ కార్యాలయంతో పాటుగా లిక్కర్ స్కాం నిందితుల సన్నిహితుల ఇళ్ళల్లో పెద్ద ఎత్తున సొదలు చేసారు. ప్రస్తుతం అధికారులు హైదరాబాద్ లోనే తిష్ట వేసారు.

Also Read : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఏటీఎం కార్డుల సైజులో కొత్త రేషన్ కార్డులు

పలు ప్రాంతాల్లో డెన్ లు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. ఈ సోదాల్లో 12 అట్టపెట్టెల్లో డంప్ చేసిన రూ.11 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ మండలం కాచారంలో ఉన్న సులోచన ఫామ్ హౌస్ లో ఈ నగదును దాచినట్టు సమాచారం అందుకున్న అధికారులు, ఆ నగదును సీజ్ చేశారు. రాజ్ కసిరెడ్డి సూచనల మేరకు ఈ డబ్బును అక్కడ దాచానని, ఈ కేసులో కీలకంగా ఉన్న మరో నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ సోదాలు జరిగాయి. ఈ కేసులో వరుణ్ A-40గా ఉన్నాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్