టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇప్పుడు తన ఆటపై దృష్టి పెట్టడం కాస్త హాట్ టాపిక్ అవుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్ట్ లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ రెండో టెస్టులో పెద్దగా రాణించలేకపోయాడు. దీనితో మూడో టెస్ట్ పై గట్టిగానే ఫోకస్ పెట్టినట్టుగా మాజీలంటున్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు కామెంట్రీ కోసం వెళ్ళిన భారత క్రికెట్ దగ్గర సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీ డెడికేషన్ గురించి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. రెండో టెస్టులో భారత్ ఓడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ వెంటనే హోటల్ కు చేరుకోకుండా ప్రాక్టీస్ సెషన్ కి వెళ్ళాడని బయటపెట్టాడు.
Also Read: రోహిత్ రెస్ట్ తీసుకో… బూమ్రాకు వదిలేయి.. ఈ ఒత్తిడిలో ఆడకు
ఆ రోజు సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేసిన తర్వాత కోహ్లీ హోటల్ కి వెళ్లి మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యులను సభ్యులను కూడా కలవకుండా మళ్ళీ ప్రాక్టీస్ సెషన్ కు హాజరయ్యాడని మూడో టెస్ట్ కు తక్కువ సమయం ఉండడంతో కోహ్లీ ఎక్కువగా ప్రాక్టీస్ సెక్షన్ లో గడుపుతున్నాడని ఆయన వెల్లడించాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లతో కోహ్లీ బౌలింగ్ చేయించుకుంటూ ప్రాక్టీస్ సెక్షన్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడంటూ చెప్పుకొచ్చాడు. మరే ఇతర ఆటగాడు కూడా కోహ్లీ తరహాలో ప్రాక్టీస్ సెషన్ కు రాలేదని కోహ్లీలో ఇంకా పరుగుల దాహం ఉందని ఆయన పేర్కొన్నాడు.
Also Read: స్లెడ్జింగ్ కాదు… ఆటపై ఫోకస్ చేస్తే బెటర్… ఆసిస్ ను తక్కువ అంచనా వద్దు
యువ ఆటగాళ్లు కోహ్లీని చూసి చాలా నేర్చుకోవాలి అంటూ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్ లో కోహ్లీ బ్యాటింగ్ అత్యంత కీలకమని ఆస్ట్రేలియా కూడా కోహ్లీ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టిందని కాబట్టి కోహ్లీ కూడా జాగ్రత్త పడుతున్నాడని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. మొదటి టెస్ట్ లో సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చినట్టే కనిపించిన కోహ్లీ రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలోను ఘోరంగా ఘోరంగా విఫలమయ్యాడు. దీనిపై కోహ్లీ టార్గెట్ గా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. రిటైర్ అయ్యే సమయం వచ్చిందని అనవసరంగా మరింతకాలం టీం లో కొనసాగి పరువు పోగొట్టుకోవద్దు అంటూ కొంతమంది సూచిస్తున్నారు.