ఇండియన్ క్రికెటర్లను విడాకుల వ్యవహారం వదలడం లేదు. మీడియాలో ప్రస్తుత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు ఎవరో ఒకరు విడాకులు వ్యవహారంతో వార్తల్లో ఉంటున్నారు. రీసెంట్ గా మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, చాహల్ ఎక్కువగా విడాకులు వ్యవహారంతో ఫేమస్ అయ్యారు. ఇక లేటెస్ట్ గా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా డైవర్స్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. తన 20 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read : బంగారపు హుండీని చిల్లర కోసం వాడుతున్నారు
సెహ్వాగ్ తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోవడానికి రెడీ అయినట్లు రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. సెహ్వాగ్.. ఆర్తి ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో జనాల్లో చర్చ మొదలైంది. దానికి తోడు గత కొన్ని నెలలుగా వీళ్ళిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. గత దీపావళి రోజున సెహ్వాగ్ ఒంటరిగా ఉన్న ఫోటోలు షేర్ చేశాడు. ఆ తర్వాత ఒంటరిగానే పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు.
Also Read : హిందీలో ‘డాకూ మహారాజ్’ రచ్చ స్టార్ట్.. ఓటీటీలో అప్పుడే..!
అయితే వీరిద్దరి మధ్య విభేదాలు ఎప్పటినుంచో ఉన్నాయని… అయితే కొంతమంది పెద్దలు వీరిని కలిపే ప్రయత్నం చేశారని.. అయినా సరే పరిస్థితులు సద్దుమణిగకపోవడంతో విడాకులు తీసుకోవాలని రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ, మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా విడాకులు తీసుకున్నారు. ఇక ఈ టైంలో సెహ్వాగ్ కూడా విడాకులు తీసుకుంటున్నాడు అనే ప్రచారం జరగడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అంతర్జాతీయ క్రికెటర్ లో బౌలర్లను చీల్చి చెండాడిన సెహ్వాగ్ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి.

