Wednesday, February 4, 2026 05:53 PM
Wednesday, February 4, 2026 05:53 PM

మిమ్మల్ని వదల.. సినిమా వాళ్ళను వెంటాడుతున్న ఐటీ

సినిమా వాళ్ళను టార్గెట్ చేస్తూ హైదరాబాదులో ఐటి దాడులు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా ఇన్కమ్ టాక్స్ అధికారులు శ్రీ వెంకటేశ్వర సినీ ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్ అదేవిధంగా మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలను కంటిన్యూ చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించడంతో వీళ్ళపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అలాగే వీళ్లకు ఫైనాన్స్ చేసిన వారిపై కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. గత నెలలో వచ్చిన పుష్ప సీక్వెల్ బడ్జెట్.. అలాగే ఆ సినిమాకు వచ్చిన ఆదాయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Also Read : ఏపీ, తెలంగాణా మధ్య కృష్ణా జలాల రచ్చ…? పరిష్కారం దొరికేనా…?

ఐటీ రిటర్న్స్ భారీగా ఉండటంతో ఈ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మంగళవారం నిర్మాత దిల్ రాజు సతీమణి తేజస్వినితో అధికారులు బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయించారు. బుధవారం మరికొన్ని డాక్యుమెంట్లను కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇక దిల్ రాజును అధికారులు తమ వద్దనే ఉంచుకున్నారు. ఆయన ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎస్ వి సి ఆఫీస్ కు ఆయన తీసుకెళ్లే అవకాశం ఉంది. ఏకంగా 55 ఐటి బృందాలు హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నాయి.

Also Read : మోనాలిసాకు సినిమా ఛాన్స్.. భారీ రెమ్యునరేషన్ ఆఫర్

రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ సినిమాలకు సంబంధించి నిర్మాత దిల్ రాజు ఇల్లు కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే ఆయన కుమార్తె హన్సితా రెడ్డి, సోదరుడు శిరీష్ ఇళ్లల్లో కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ కు సంబంధించి నవీన్ యెర్నేని, సీఈఓ చెర్రీ ఇల్లు కార్యాలయాలు పరిశీలిస్తున్నారు. అయితే పుష్ప సినిమాకి భారీగా వసూళ్లు వచ్చాయని నిర్మాతలు ప్రకటించారు. దీనితో అసలు వాస్తవాలు, జీఎస్టీ లెక్కలు, ఆదాయంలో ఈ కలెక్షన్స్ చూపించారా అనేదానికి సంబంధించి ఐటీ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. సింగర్ సునీత భర్త రాముకు సంబంధించి మ్యాంగో మీడియా సంస్థల్లో కూడా ఐటీ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

పోల్స్