Sunday, October 19, 2025 08:09 PM
Sunday, October 19, 2025 08:09 PM
roots

స్పిరిట్ విలన్ అతనే.. సందీప్ రెడ్డి సేఫ్ సెలెక్షన్

ఇండియన్ సినిమాలో బిజీ హీరో ఎవరు అంటే వెంటనే గుర్తు వచ్చే పేరు ప్రభాస్. పాన్ ఇండియా హీరోగా వరస హిట్లు కొడుతూ బాలీవుడ్ కు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో దాదాపు 6 సినిమాలు ఉన్నాయి. మరో రెండు సినిమాలు లైన్లో పెట్టినట్లు కూడా టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇదే టైంలో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read : ఆస్ట్రేలియాకు భారీగా కోహ్లీ ఫ్యాన్స్..!

క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో చేస్తున్న ఈ సినిమాపై అటు బాలీవుడ్ కూడా ఆసక్తిగా చూస్తోంది. యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో కూడా సందీప్ రెడ్డి వంగా ఫేమస్ అయ్యాడు. దీనితో స్పిరిట్ సినిమాపై అటు బాలీవుడ్ కూడా లెక్కలు వేస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్ ఎవరు అనేదానిపై సందీప్ రెడ్డి వంగ ఇంకా క్లారిటీకి రాలేదు. దాదాపుగా హాలీవుడ్ విలన్ ఉండే అవకాశం ఉంది అనే ప్రచారం జరిగింది.

Also Read : జూబ్లీహిల్స్ అభ్యర్థి ఆయనే..? ఫైనల్ చేసిన కాంగ్రెస్

అయితే ఇప్పుడు కాస్త క్రేజీగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ కు ఈ సినిమాలో విలన్ గా ఛాన్స్ ఇవ్వాలని సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేశాడు. వివేక్ ఒబెరాయ్ అయితే బాగుంటుందని వర్కౌట్ చేస్తున్నట్లు టాక్. గతంలో వివేక్ పలు తెలుగు సినిమాల్లో నటించాడు. డైరెక్ట్ తెలుగు సినిమాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అటు రెమ్యూనరేషన్ విషయంలో కూడా పెద్దగా అతను ఇబ్బంది పెట్టడు అనే టాక్ ఉంది. ఇప్పటికే సందీప్ అతనికి స్టోరీ కూడా వినిపించినట్లు బాలీవుడ్ మీడియా అంటోంది. ముందు ఓ స్టార్ యాక్టర్ అనుకున్న సరే రెమ్యూనరేషన్ విషయంలో భయపడి.. సందీప్ వెనక తగ్గాడట. ఇక ఈ సినిమా షూటింగ్ 120 రోజులు జరగనుంది. అందులో 90 రోజులు ప్రభాస్ కాల్ షీట్స్ ఇచ్చినట్లు టాక్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్