ఆర్మీలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుల జీవిత కథల ఆధారంగా పలు సినిమాలు వస్తున్నాయి. బాలీవుడ్, కోలీవుడ్ ఈ విషయంలో కాస్త ముందు ఉన్నాయి. మన తెలుగులో వీటి విషయంలో కాస్త వెనుకబడినా.. బాలీవుడ్ మాత్రం దూసుకుపోతోంది. దేశ భక్తి పెంచే సినిమాలపై ఫోకస్ పెట్టింది. షేర్షా, అమరన్ ఇలా పలు సినిమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గాల్వాన్ లోయలో జరిగిన సంఘటన ఆధారంగా ఓ సినిమా చేస్తున్నాడు.
Also Read : నిన్ను కొట్టనురా.. వచ్చి కలువురా.. లారెన్స్ ఎమోషనల్
‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ పేరుతో ఓ సినిమాను అనౌన్స్ చేసాడు. 2020లో సముద్ర మట్టానికి 15000 లడఖ్ సమీపంలోని గాల్వాన్ వ్యాలీలో భారత్ – చైనా సైనికుల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. భారత్ ఈ దాడిలో దాదాపు 40 మందికి పైగా సైనికులను కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో సూర్యాపేటకు చెందిన సైనికుడు సంతోష్ కుమార్ కూడా ప్రాణాలు కోల్పోయారు. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేసారు.
Also Read : బరిలో టీడీపీ.. కాంగ్రెస్ కు షాక్ తప్పదా..?
ఈ లుక్ లో సల్మాన్ ఖాన్ ముఖం రక్తంతో తడిచిపోయి ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇటీవల వచ్చిన సికిందర్ సినిమా సల్మాన్ కు షాక్ ఇచ్చింది. దీనితో దేశ భక్తి వైపు సల్మాన్ ఫోకస్ పెట్టాడు. లారెన్స్ గ్యాంగ్ దెబ్బకు దేశభక్తి సినిమాలు చేసి పాజిటివ్ వాతావరణం క్రియేట్ చేసుకోవాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమాను స్వయంగా సల్మాన్ ఖాన్ నిర్మించడంతో బాలీవుడ్ జనాల్లో ఇప్పటి నుంచే చర్చలు మొదలయ్యాయి.




