Tuesday, October 28, 2025 06:56 AM
Tuesday, October 28, 2025 06:56 AM
roots

రైల్వే స్టేషన్ సెట్.. వణికిపోతున్న కండల వీరుడు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ దెబ్బకు ప్రాణ భయంతో వణికిపోతున్నాడు. అతను ఇప్పుడు అరెస్ట్ అయినా.. సల్మాన్ కి మాత్రం ప్రాణభయం తగ్గలేదు. సినిమాల్లో వందల మందిని ఒంటి చేత్తో పడుకోబెట్టే ఈ స్టార్ హీరో ఇప్పుడు ఓ కుర్ర రౌడీకి బతుకు జీవుడా అంటూ ప్రాణం కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నాడు. సల్మాన్ ఖాన్ జీవితంలో గత నెల రోజులు ఖచ్చితంగా అత్యంత భయంకరం అనే చెప్పాలి. అసలు ఎక్కడికి వెళ్ళాలి అన్నా ఏం చేయాలన్నా సరే భయపడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో సికిందర్ అనే సినిమా చేస్తున్నాడు సల్మాన్ ఖాన్.

Also Read : మోడరన్ డే హీరో… ది బెస్ట్ డిఫెన్స్ టెక్నిక్

ఈ సినిమా షూట్ కీలక దశలో ఉంది. మొన్నటి వరకు హైదరాబాద్ లో షూట్ చేయగా ఇప్పుడు ముంబైలో షూట్ జరుగుతోంది. ముంబైలో జనవరి చివరి వరకు కీలక సీన్స్ ను ప్లాన్ చేసారు. ఆ తర్వాత అక్కడి నుంచి చెన్నైలో షూట్ చేస్తారు. అయితే ఇప్పుడు సల్మాన్ ప్రాణ భయం నిర్మాతలకు, దర్శకుడికి పెద్ద తలనొప్పి అయింది. అసలే ఈ భారీ బడ్జెట్ సినిమాకు నిర్మాతలు ఇప్పటికే భారీగా ఖర్చు చేసారు. సల్మాన్ కు సెక్యూరిటీ భయం ఉండటంతో పెద్ద ఎత్తున భద్రతను కల్పిస్తున్నారు. ఓ బుల్లెట్ ప్రూఫ్ కార్ కూడా సెట్ చేసారు.

Also Read : రోహిత్ Vs రాహుల్.. ఓపెనింగ్ స్థానం ఎవరికి?

ఇక ఇప్పుడు ముంబైలో ఓ రైల్వే స్టేషన్ లో సినిమా షూట్ చేయాల్సి ఉండగా… ఏకంగా రైల్వే స్టేషన్ సెట్ ను వేసారు ఓ స్టూడియోలో. జనాల రద్దీలేని రైల్వే స్టేషన్ లో షూట్ చేద్దామని చెప్పినా సరే సల్మాన్ వినకపోవడంతో ఇప్పుడు నిర్మాతలు అలా ప్లాన్ చేసారు. దాదాపు 350 మంది షూట్ లో పాల్గొనాల్సి ఉండగా… సినిమా యూనిట్ మొత్తం కలిపి సెట్ లో 60 మంది వరకే ఉన్నారు. అందులో సల్మాన్ భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఇలా సల్మాన్ ఖాన్ తన ప్రాణ భయంతో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్