Friday, September 12, 2025 11:18 PM
Friday, September 12, 2025 11:18 PM
roots

మాకేం సంబంధం లేదు.. మా జోలికి రావొద్దు..!

అడుసు తొక్కనేల.. కాలు కడగనేల.. అన్నారు పెద్దలు.. అంటే బురదలో కాలు పెట్టడం ఎందుకు.. తర్వాత ఆ బురద పోవడానికి కాలు కడుక్కోవటం ఎందుకు అనేది ఈ సామెత అర్థం. నిజమే.. తప్పు చేసినప్పుడే సారీ చెప్పాలి. అసలు తప్పే చేయకపోతే.. సారీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. ఏది అనాలనిపిస్తే అది అనేశారు.. అది అనకూడదో అదే మాటను పదే పదే అన్నారు. తమ ప్రత్యర్థులను ఎవరైనా కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తుంటే.. దానిని ఎంకరేజ్ కూడా చేశారు. ఇదంతా సరిగ్గా పది రోజుల క్రితం మాట. చివరికి రెండు లాఠీ దెబ్బలు తగిలే సరికి.. బాబోయ్.. మాకేం సంబంధం లేదు.. మా జోలికి రావొద్దు అంటూ ఇప్పుడు కాళ్ల వేళ్ల పడుతున్నారు.

Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ..!

సాక్షి మీడియా.. ఈ సంస్థ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2008లో ప్రారంభమైంది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించిన సొమ్ముతో మీడియా సంస్థ ప్రారంభించారనేది ప్రధాన ఆరోపణ. నాటి నుంచి కూడా కేవలం టార్గెట్ చంద్రబాబు, టీడీపీ అన్నట్లుగానే ఈ పత్రికి, ఛానల్ పని చేస్తున్నాయి. తెల్లారి లేచింది మొదలు ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలను ఎల్లో మీడియా అని సాక్షిలో ఆరోపిస్తూనే ఉంటారు. మరి వైసీపీకి అనుకూలంగా భజన చేయడాన్ని ఏ మీడియా అంటారూ అని ప్రశ్నిస్తే మాత్రం.. సైలెంట్ అయిపోతారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా అది సమాజ శ్రేయస్సు కోసమే అంటారు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే విధానం చంద్రబాబు అనుసరిస్తే మాత్రం.. ఇది కుట్ర, మోసం, దగా.. అంటూ పెద్ద పెద్ద పదాలు వాడేస్తారు.

Also Read : మెగా ఫ్యాన్స్‌కు తప్పని నిరాశ.. ఆ సినిమా సంగతేంటి..?

చంద్రబాబును అరెస్టు చేస్తే.. లాలూ ప్రసాద్, మధుకోడా కంటే వృద్ధుడా అంటారు.. అంకబాబును అరెస్టు చేస్తే.. నోరెత్తరు.. కానీ కొమ్మినేని దగ్గరకు వచ్చే సరికి మాత్రం.. 70 ఏళ్ల వృద్ధుడు, సీనియర్ సిటిజన్ అని కల్లబొల్లి మాటలు చెబుతారు. ఇక 50 ఏళ్ల పాత్రికేయ వృత్తిలో ఎలాంటి తప్పు చేయలేదని గొప్పగా చెప్పారు కొమ్మినేని. మరి ఒక పార్టీకి అనుకూలంగా, మరో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం జర్నలిస్టు లక్షణమా అంటే నో ఆన్సర్. ఏ ఛానల్‌లో అయినా సరే.. డిబేట్‌లో పాల్గొన్న వక్తలు, విశ్లేషకులు తమ అభిప్రాయాలను, పార్టీ విధానాలను స్పష్టం చేస్తారు. వాస్తవానికి దీనికి సంస్థ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు. ఇక ఏదైనా తప్పు జరుగుతుంది అని ముందుగా అనిపిస్తే.. ఆ డిబేట్‌ను ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో కొమ్మినేని షో లోనే బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ ఓయూ జేఏసీ నేతపై లైవ్ లోనే దాడి చేశాడు. అప్పుడు కొమ్మినేని తన షో ఆపేశారు. ఆ వెంటనే ఈ ఘటనకు మాకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ యాజమాన్యం నోట్ విడుదల చేసింది.

Also Read : ఫోన్ ట్యాపింగ్ లో పేలిన బాంబు.. వెయ్యి మంది ఫోన్లు..?

ఇటీవల సాక్షిలో నిర్వహించిన ఓ డిబేట్ పెద్ద దుమారం రేపింది. అనలిస్టు ముసుగులో అమరావతి ప్రాంతంపైన, మహిళలపైన కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఈ డిబేట్ నిర్వహించిన కొమ్మినేని కూడా అవును.. నేను కూడా ఆ ఆర్టికల్ చదివాను అని చెప్పడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. దీంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి సాక్షి సంస్థపై దాడి చేశారు. కొమ్మినేని, కృష్ణంరాజుపై రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. దీనిపై సాక్షి యాజమాన్యం ఏకంగా సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. డిబేట్‌ నిర్వహిస్తే.. అరెస్టు చేస్తారా అని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే సుప్రీం కోర్టు మాత్రం.. మరోసారి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామంటూ కండిషన్ బెయిల్ మంజూరు చేసింది.

Also Read : అవును.. వీళ్లంతా జర్నలిస్టులు..!

సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సాక్షి యాజమాన్యం తన తప్పు తెలుసుకున్నట్లుంది. నిన్నటి వరకు మీడియా గొంతు నొక్కుతున్నారు.. పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన సాక్షి యాజమాన్యం.. ఇప్పుడు మాత్రం.. మాకేం సంబంధం లేదు అంటోంది. డిబేట్ ప్రారంభానికి ముందే డిస్క్లైమర్ వేస్తోంది. ఈ డిబేట్‌లో వక్తలు చేసే వ్యాఖ్యలతో సాక్షి యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని.. అదంతా వారి వ్యక్తిగతమని రాసుకొచ్చింది. వాటిని సమర్థించడం, ప్రచారం చేయడం జరగదని.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే.. దానికి ఛానల్‌ ఎలాంటి బాధ్యత వహించదని.. అలాంటి వాటిని సాక్షి తీవ్రంగా ఖండిస్తుందని షో ముందు డిస్క్లైమర్ వేస్తోంది. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తమకు లేదని సాక్షి పేర్కొంది.

Also Read : తల్లికి వందనం.. కూటమికి కాదు.. టీడీపీకి బూస్ట్ ఇచ్చిందా..?

తెలుగులోనే కాదు.. మీడియా చరిత్రలోనే చర్చా కార్యక్రమాలకు ముందు ఈ తరహా డిస్క్లైమర్ వేయేడం ఇదే తొలిసారి. కొమ్మినేని షో కారణంగా సాక్షి యాజమాని వైఎస్ భారతీ రెడ్డి చుట్టూ ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరికి భారతీ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని సాక్షి కార్యాలయాల ఎదుట ఆందోళనలు కూడా చేశారు. దీంతో మరోసారి ఈ తరహా వివాదాలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటోంది. బెయిల్ పై విడుదలైన కొమ్మినేనిని కొద్ది రోజుల పాటు ఛానల్‌కు దూరంగా పెట్టే అవకాశం ఉందని సంస్థ ఉద్యోగులే చెబుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్