గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపేస్తున్న అంశం.. సాక్షి ఛానల్ డిబేట్ లో అమరావతి ప్రాంత మహిళలను వేశ్యలుగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం. దీనిపై మహిళా సంఘాలతో పాటుగా రాజకీయ పార్టీలు సైతం మండిపడుతున్నాయి. ముందు నుంచి అమరావతిని తక్కువ చేసి మాట్లాడే వైసిపి తమ అధికారిక ఛానల్ లో సైతం ఇదేవిధంగా వ్యాఖ్యలు చేయడంపై సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అలాగే వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు అనే ఫ్రీ లాన్స్ జర్నలిస్టును అరెస్టు చేయాలని డిమాండ్లు వినపడుతున్నాయి.
Also Read : తండ్రీ, కొడుకుల అరెస్టుకు రంగం సిద్ధం..? ఎమ్మార్వోకి మూడింది..?
ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం వెనకడుగు వేస్తుందని టిడిపి కార్యకర్తలు సోషల్ మీడియాలో మండిపడుతూ వచ్చారు.. ఇక అందరూ ఊహించినట్లుగానే ఈరోజు ఉదయం కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుళ్లూరులో ఆయనపై కేసు నమోదు కాగా అక్కడి పోలీసులు హైదరాబాద్ వెళ్లి ఆయనను అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొస్తున్నారు. ఇక కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసే సమయంలో సాక్షి ఉద్యోగులు అడ్డుపడ్డారు. ఏ విధంగా కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తాను సీనియర్ సిటిజెన్ అని అలాంటి వ్యక్తిని ఏ విధంగా అదుపులోకి తీసుకుంటారని మండిపడ్డారు కొమ్మినేని.
Also Read : విషం చిమ్ముతున్న వారి కోరలు పీకుతారా..?
రాష్ట్రవ్యాప్తంగా ఆయన పై కేసులు నమోదు కావడంతో తుళ్లూరు పోలీసులు.. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా సాక్షి ఆఫీస్ కి వెళ్లారు. అయితే కొమ్మినేని నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడంపై సాక్షి ఉద్యోగులు కాసేపు హడావుడి చేశారు. ఇక తనను అరెస్టు చేసే సమయంలో కొమ్మినేని శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. ఎవరో విశ్లేషకుడు వ్యాఖ్యలు చేస్తే తనను ఏ విధంగా అరెస్టు చేస్తానని ఆయన మండిపడ్డారు. తన అరెస్టు వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందని వ్యాఖ్యానించారు కొమ్మినేని శ్రీనివాసరావు. సాక్షి ఛానల్ లో ఆ మాటను ఒకసారి మాత్రమే అన్నారని కానీ అదే మాటను ఆంధ్రజ్యోతితో పాటుగా టిడిపికి అనుకూలంగా ఉండే చానల్స్ కొన్ని వందలసార్లు అన్నాయని మరి వారిని కూడా అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.




